కవిసార్వ భౌముఁడు శ్రీ నా ధుఁడు
శా; పంచారామ విలాసినీ ధవళ దృక్పాఠీన జాలాయ మా
నాంచత్కారము నిర్నిబంధన మనోజ్ఙా కార రేఖా
పంచా స్త్రుండగు నా కుమారకుఁడు దర్ప స్ఫూర్తి నవ్వీటిలో
సంచా రం బొనరించెఁ గాంచన మహా సౌధాగ్ర భాగంబులన్ ;
శివరాత్రి మాహాత్మ్యము- 2ఆశ్వా- 17 వ పద్యము
భావము: ఇది ముందు మనము చెప్పుకొనఁ బోవు శివరాత్రి మాహాత్మ్యము లోనిది. సుకుమారునివర్ణనము. వానిరూపము మిగుల గొప్పది. దక్షారామం లోనేగాక పంచారామ సీమలలో వానిని జూచిన మానినీ మత్స్యముల తెలిగన్నులనే మత్స్యములను బట్టు వలవంటిదట! నిబమధనారహితుఁడయిన మనేహరమైన ఆకార రేఖతో మన్మధుని దలపించు నాతఁడు మహాగర్వియై కాంచనమయ మైన మేడల శిఖరములయందు నాపట్టణమున సంచరింప సాగెనని దీని భావము ; ముందు ముందు ఈపద్యమును సమన్వయ మొనరింతము. ముందుకు బోదము.
అవచి తిప్పయకు హరవిలాసము నంకిత మొసఁగి యతడిచ్చిన ధనమును చేతఁబట్టి శ్రీనాధుఁడు
మహాశైవ క్షేత్రమగు శ్రీశైలమునకు ప్రయాణ మయ్యెను. రెడ్డిరాజులపై నొడ్డెరాజుల తిరుగు బాటువార్త యొకటి యతని చెవులఁ బడెను. ఇటు బహమనీ సుల్తానులు విజయ నగరముపై దండెత్త నుంకించు చుండుటయుఁదెలిసెను. గోరుచుట్టుపయి రోకలి పోటు చందమున కాకతీయులపై మొగలు రాజుల దండయాత్రయు నారాజ్యము పతనమై గోల్కొండ రాజుల యేలుఁబడి లోనుండుటయు, నొకటొకటిగా నన్నియు చెడువార్తలే చెవిని బడసాగెను. రాజమహేంద్రవరము ఒడ్డెరాజన్యుల పరమగుటకు సిధ్ధముగానుడుటయు, దుఃఖ దాయకమయ్యెను. ఇదీ అప్పటి రాజకీయ స్ధితి.
దైవముపై భారముంచి ప్రయాణమును కొనసాగించెను. శ్రీశైవమున శైవ మఠమున బస యమిరినది. భ్రమరాంబా మల్లిఖార్జనుల దర్శనమైనది. కర్తవ్యాలోచన చేయసాగెను." ఇపుడా ప్రభువులు సంకట స్ధితిలో నున్నారు. యీస్ధితిలో తానేగి చేయునదేమి? సలహాలిచ్చుటకు సింగనా మాత్యుఁడు కలఁడుగదా! తానిప్పుడు కొంకాలమిచటనే యుండుట లెస్స. పరిస్ధితుల యనుకూలము ననుసరించి కొండవీటికేగ వచ్చును" అనితలపోయుచు దైవదర్శన భాగ్యమున కలరుచు నట కొంతకాలము గడుప నిశ్చయిచెను.
శ్రీ శైలము నందలి శైవ మఠమునకు అధికారి పువ్వుల శాంతయ్య యను జంగము దేవర యతడు చాలకాలమునుండి శైవ సంబంధమగు నొక కావ్యమును దనపేర వెలయింపఁజూచుచుండెను. శ్రీనాధ కవి రాకతో నది చిగురులుఁ దొడిగినది. యొకానొక శుభముహూర్తమున శ్రీనాధుని కడ కేగి యంజలి ఘటించి " కవిసార్వ భౌమా! తమ రాకచే నామఠము , నాజన్మమును కృతార్థములైనవి. నాదొకటి చిరకాల వాంఛ మిగిలియున్నది. లోకోత్తరమగు శివరాత్రి మాహాత్మ్య కధను తమరివలన వనవలెనని, నేటికి యాపరమ శివుని దయచేనాకోరిక దీరు నవకాశముఁజిక్కినది . నావిన్నపమును మన్నించి దయతో నాగ్రంధరాజమును నాపేర వెలయిపుడు; ఇది మీకుఁ దక్క నన్యులకు సాధ్యముఁగాదని బలికెను. "
శ్రీనాధుఁడు సమ్మతించి స్కాంద పురాణ కధను తనకవితచే మెరుగులు దిద్ది చతురాశ్వాస పరిమిత శైవ ప్రబంధముఁగా తీర్చి దిద్దెను. శివరాత్రి మహాత్మ్యమును ఐదాశ్వాసముల కెక్కుడుగా కవిసార్వ భౌముఁడు రచించెనని కొందరివాదన. వాదనలకేమి వేయి. కానీయాగ్రంధము నేఁడు దొరుకుటయే గగనమే! మనయదృష్టము వలన మిత్రులు శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి తోడ్పాటుతో 1930 సం:లో ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన (అక్కడక్కడ సిధిలమైన) ఒక ప్రతి లభించినది. దానిసాయమున నాపరిశీలనకు అవకాశము చిక్కినది వారికి మనఃపూర్వక ధన్యవాదములు!
ఇందలి కథ:- శివ విష్ణువులు తామే గొప్పవారమని యెవరికి వారు కలహింప శివుడు వారిని బిలిచి పరీక్షఁబెట్టుట. వారాపరీక్షలోనోడి శివుఁడే తమకన్నమిన్న యని ప్రకటించి శివ మహిమను దెలుపఁగోరుట, శివుఁడు వారికి శివరాత్రి మహిమమును సోదాహరణముగా వివరించుట యిందలి ముఖ్య విషయము. ఆశివరాత్రి మహిమను దెలుపుటకు శివుఁడెన్ను కున్న కధ సుకుమారుని కధ.
ఇది యించుమించు కాశీఖండములోని " గుణనిధి" కధకు సమానము. పుట్టుతో నుత్తమ బ్రాహ్మణ కులజాతులై వేద వేదాంగ పారంగతులై రూపవిజిత మన్మధులై విధివశమున చెడుసావాసములకు లొంగి, జూదపరులై, చోరులై, మద్యమాంస భక్షకులై, పరాంగనాసంగమ లోలురై యింటగల ద్రవ్యమంతయుఁదొంగిలి గొనిపోయి, తుదకు యింటికి నుండి గెంటివేయబడి యతినికృష్టపు బ్రతుకు చవిజూచి , చివరకు గతజన్మ సుకృతమోయేమో శివరాత్రినాడు ఆహారములభింపమి నుపవసించి , మరునాడు వ్రేపకడ యాహార సంపాదనకై శివాలయమున బ్రవేశించి , ప్రసాదభక్షణ మొనరించుటచే శివానుగ్రహ పాత్రులయి కైలాసము నందుకొన్నారు. సరిగా నిలాంటి కధ యే మరియొకటి యున్నది. అదితెనాలి రామకృష్ణుని చే చిత్రింపఁ బడిన పాత్ర. "నిగమ శర్మ" అతఁడు వీరికిఁదమ్ముఁడు . వీరికన్నామిగుల ఘనుఁడు.
పైపద్యము ఇతని గొప్పదనమునే వెల్లడించు చున్నది. యిక విషయమునకు వత్తుముగాక!
వింధ్యాచల ప్రాంతమును హేమపాలుఁడు పరిపాలించు చుండెను. ఆతని మహామంత్రియు, గురువునగు యజ్ఙదత్తునకు కులసతి సుశీల యాపుణ్య దంపతులకు చాలకాలమువరకు సంతతిలేదు .
తే: తవయ సంతాన లబ్ధి దౌ దవ్వుగాగ
విభవ సంపత్తి గల్గియు విన్నఁబోయి
పుత్ర వదనావ లోక నోధ్భూతమైన
శర లతా కాననము వోలె జవ్వనంబు; - సంతాన లేమిచేత వారి యవ్వనం రెల్లు పూల వనంగా మారిపోయందట! రెల్లు తెల్లగా పూత పూస్తుంది చూడటానికి చాలా అందంగా వుంటుంది. కానీ కాయలుమాత్రం దానికి రావు. వీళ్ళుకూడా అలాగే యిరుగు పొరుగు లకు కనిపిస్తు న్నారు. కానీ యేంప్రయోజనం? యజ్ఙదత్తుని యజ్ఙాలు ఫలించాయి. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. చాలాగారాబంగా పెంచారు. తనకు వచ్చిన వేదాది విద్యలను తండ్రి నేర్పాడు పెద్దవాఁడయ్యాడు. యువతీజన మన్మధుఁడై యలరారుతున్నాడు. వాడి దృష్టి యిప్పుడు యెప్పుడూ ఆడవాళ్ళమీదే! దీనికి తోడు వాడికి దుష్టజన సాంగత్యం అబ్బింది. వారితోఁగలసి జూదమాడటం నిత్యకృత్యమైంది. తల్లికి తెలుసు. పిల్లడి మీదమమకారం తండ్రికి తెలియనీయకుండా ఆమెను వారించింది. అదివాడికి లోకువ గామారింది. యింటనున్న మణిమాణిక్యాదులు సంపదఅంతా జూదరులపాలైంది. యిప్పుడు దొంగగాకూడా మారాడు. వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, జూదంలో మొనగాడయ్యాడు.
పాపం! యజ్ఙదత్తునకు యీవిషయాలుఁదెలియవు. ఇంటిదొంగ గదా! పట్టనెవ్వరి వశం? ఒకనాఁడు యజ్ఙదత్తుఁడు రాజసభనుండి యంటికి వస్తున్నాడు. దారిలో నొకజూదరి తన నవగ్రహ వేష్ఠన మైన అంగుళీయకాన్ని ధరించివిలాసంగా వెళుతున్నాడు. పురోహితునకు పట్టరాని కోపం వచ్చింది. ఆపాడు."ఒరే/ దొంగా! నీకెక్కడిదిరా యీయుంగరం? చెప్పక పోతే రాజ దండన తప్పదన్నాడు." దానికి బదులుగా" మీరు వేదాది విద్యలలో యెంత పండితులో మీపుత్రరత్నం జూదంలో అంతగొప్ప పండితుడు. అతడుజూదమాడి యోజినదీ యుంగరము. గెలిచితిమి. మేము దొంగలమా? యేమి?" యనిఁబలుక నవమానముతో గబగబ నిటికేగి జరిగిన దంతయు నెరింగెను. చెడిపోయినకుమారుని యందు కరుణఁజూపక యిలువెడల నడచెను.
సుకుమారునకు పెద్దలయాస్తిని గుడించుటయే దెలియునుగాని గడించుట యతనికేమి దెలియును? అడవినిబడినాఁడు. ఆకలితో పేగులు మాడుచున్నవి. అప్పుడు ఇల్లు , తల్లియు గుర్తుకు వచ్తినారు. కన్నతల్లిని దలచుకొని ,
చ: అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయిం బొడతేర, గిన్నెలో,
బెరుఁగును, వంటకంబు, వడ పిందియలున్, గుడువంగ బెట్టు ని
ర్భర కరుణా ధురీణ యగు ప్రాణము ప్రాణముఁ దల్లి యున్నదే!
హర హర! యెవ్వరింక కడుపారసి బెట్టెద రీప్సతాన్నమున్; - అనియాయడవిని బడి వల వల యేడ్చినాఁడు. ఇంకను బుధ్ధిరాలేదు. ఆయటవిలో నొకఛండాలుఁడు జాలిపడి వాని నింటికి గొనిపోయెను.ఃకూడు వెట్టి నిదురింప గూడునిచ్చెను. ప్రత్యుపకృతిగా నతని భార్యను లేపుకొని పారిపోయెను. వారట్లు పోయి కిరాతులలో గలసిరి వేచాడుట , దొంగతనము, దోపిడీ లు జీవన వృత్తులయినవి. కొంతకాలమున కామాలెతయు వీనిని బరిత్యజించెను.
అపుడీతడు అడవినిబడి పోవుచు శివరాత్రమున ఆహారము లభింపమి నుపవాసియై ప్రక్కనున్న శివాలయమునకేగి, భజనచేయు భక్తులు వెడలునందాక కాపుండి వ్రేగు సమయమున వారు బోవ గుడిలోదూరి, ప్రసాదమును భుజియించి , రేయంతయు నిదుర లేమిచే నందే నిదురించెను. ఇంతలోభక్తులరుదెంచి దొంగ యనిభావించి చావమోదినారు. విగత జీవుడయినాడు. నరకమునుండి యమభటులును, కైలాసము నుండి శివభటులును యరుదెంచిరి' వాదోపవాదముల యనంతము అతడు శివభక్తుల ప్రాపున కైలాసమున కేగెను. ఇదీ కధ!
శివరాత్రినాఁడు పవసించి, జాగరణమొనర్చుట, కారణములుగా నతఁడు కైలాసమున కేగగల్గినాడు. యెంతటి పాపియైనను శివరాత్రి నాడు ఉపవసించి జాగరణమొనరించిన , వారికి కైలాస ప్రాప్తి తధ్యము! అనిఫలితార్ధము.
శ్రీనాధ కవిత యిందు కొంత ప్రౌఢతనుఃప్రదర్శంచినను, గత గ్రంధకధలను తడిమి కావ్యమును విరచించుటచే, నంతగా రాణకెక్క లేదని ఫలితార్ధము. యింతటితో నేటికి ముగింతము. సెలవు!