కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
ఒక నాడు " రసికుడు పోవడు పలనాడు" అనియెకసెక్కము లాడినశ్రీనాధునకు తుదకు పలనాటి నివాసము తప్పలేదు గదా! ఆహా! విధియెంతవిచిత్రమైనది. ఒకనాడు ప్రౌఢ కవిత్వమే కవిత్వ మని గొప్పలు జెప్పిన శ్రీనాధుడు నేడు పదకవితకు పట్టము గట్టక దప్పలేదు. ప్రజా కవిత్వ మేదియో యతనికి యిప్పుడెరుక పడినది. అందుచేతనే నేడు ద్వపద రచనమునకు బూనుకొనినాడు. ద్వపదయనునది దేసి రచన యదిపదమే గాని పద్యముగాదు. ద్వి పదము రానురాను ద్వపదగా మారినది.
ప్రాఙ్నన్నయ యుగమంతయు నిట్టి పాటల లోనే సాహిత్యము విస్తరిల్లినది. తరువోజ, మధ్యాక్కరలు నాటి దంపుడు పాటలకు ప్రతిరూపములు. శ్రమైక జీవులగు పామరులు పనులుజేయునపుడు శ్రమాపనోదనార్ధమై యిట్టి పాటలను పాడుకొనెడివారు. ద్విపదయు నట్టిదియే! చిన్నచిన్న పదములతో యలతియలతి భావములతో రెండు పదములల్లి పాడుకొనెడివారు. రానురాను యివి పండితుల యాదరణమునకు నోచుకొని శివకవుల నాటికి సాహిత్య రూపమునకు వచ్చినవి. ద్వపద సాహిత్యాభివృధ్ధికి మూలకారకులు శివ కవులేననుట తథ్యము!
ప్రజల నాడి యిప్పటికి శ్రీనాధునకు బోధపడినది. కావున ప్రజాసాహిత్య సాధనగా ద్విపద నెన్నుకొన్నాడు. మంజరీ ద్విపద యొకభేదము. యిదియలనాటి యక్షగానములందునను, హరికధలయందునను కధానిర్వహణమునకు ఉపయోగించు చుండెడివారు. చెప్పునది వీరగాధ పాటకు యాటకు మంజరీ ద్వపద యనుకూల మగుటచే కవిసార్వభౌముడు దానినే స్వీకరించినాడు.
పలనాటి కధ యొక బృహత్ గ్రంధము తాటియాకులలో చివికి పోవుచున్న నీగ్రంధమును శ్రీ అక్కిరాజు ఉమాకాంతం పండితులు దానిని బరిష్కరించి 1911 సం లోప్రకటించినారు . మిత్రులు శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారిదయ వలన నాకది చిక్కినది. అక్కడక్కడ శిధిలమై యున్న దానిసాయమున నేనీగ్రంధమును మీకు పరిచయము జేయగలుగుచున్నాను. మిత్రునకు కృతజ్ఙతలు!
పలనాటికధ మిగుల పెద్దది. దానికిది సంగ్రహ పరిచయము_
పలనాటి రాజ్యమునకు ప్రభువు అనుగురాజు. అతనికి మువ్వురు సతులు. క్రమముగావారికి
నలగమరాజు, నరసింహరాజు, మలిదేవరాజు మున్నగు కుమారు లుదయించిరి. వారితల్లులు వేరు. సోదరులు. తండ్రియనంతరము నలగామరాజు ప్రభువయి గురజాల రాజధానిగా పలనాటినేలెను. బ్రహ్మనాయుడు మంత్రి. మలిదేవరాజప్పటికి పిన్నవాడగుట బ్రహ్మ నాయుని రక్షణలో నుండెను. కతిపయదినములకు బ్రహ్మనాయుని కోర్కె ననుసరించి మలిదేవునకు కొంతరాజ్యమును నలగముఁడొసగెను. మాచర్ల రాజధానిగా కొంత పలనాటికి మలిదేవుడు ప్రభువయ్యెను. బ్రహ్మ నాయుడు మంత్రిగా దోడ్పడుచుండెను.

బ్రహ్మ నాయుని స్థానమున నాయకురాలు నాగమ్మ నలగామునకు మహామంత్రిణి యయ్యెను. నాగమ మిగులజాణ కుటిలస్వభావి, అహంభావి, అంతవరకు ఆనందముగా సాగుచున్న యాయన్నదమ్ముల మధ్య మాయమాటలతో వైరమును రగిలించెను.భారత కధలో శకుని వంటిది నాగమ
తుదకది భయంకరమైన యుధ్ధమునకు దారిదీసి పలనాటివీరుల దుర్మరణమునకు కారకమయ్యెను. నాగమ మాయమాటలువిని నలగాముడు మలిదేవుని కోడిపందెములలో మోసముతో జయంచెను. ఓటమిఫలితముగా వారికి నేడేండ్లు వనవాసము విధింప నాయవధిని వారు పూర్తి యొనరించి రాజ్యభాగము నడుగ కాదని నలగాముడు వారిని యుధ్ధమున కాహ్వానించెను. నాగులేటి యొడ్డునగల కారెమపూడిలో నిరు పక్షములకు భయంకరమైన యుధ్ధముజరిగెను. అందు యిరు పక్షములవారు విశేషముగా మరణించిరి. చివరకు విజయము ధర్మ పక్షమును వరించినది. మలిదేవుడు జయమునందు కొన్నాడు.

నేటికింతటితో నీప్రసంగమును విరమింతము రేపుఃతక్కన ముచ్చట. సెలవు.
No comments:
Post a Comment