కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
శ్లో శరదిందు వికాస మందహాసామ్ !
స్ఫుర దిందీవర లోచనాభిరామామ్!
అరవింద సమాన సుంద రాస్యామ్!
అరవిందాసన సుందరీ ముపాస్యే!
స్ఫుర దిందీవర లోచనాభిరామామ్!
అరవింద సమాన సుంద రాస్యామ్!
అరవిందాసన సుందరీ ముపాస్యే!
పలనాటి వీర చరిత్రము
ద్విపద: శ్రీ రఘు నాయకుఁ జిత్తమం దెంచి
శ్రీకంఠు పరమేశు శివు నాత్మ దలచి
పార్వతీ దేవికి భావించి మ్రొక్కి
శివగణంబుల నెల్ల చితించి పొగడి
ప్రాకటంబుగ విష్ణు ప్రార్ధనల్ జేసి
-----+++-------+-----+++
చెప్ప నేర్చిన వాడ చెలగి మాచర్ల
చెన్నకేశవ స్వామి సేవ నిరతుండ
వలను భారద్వాజ వంశ వర్ధనుడ
కవిసార్వభౌముడన్ ఘనత గన్నట్టి
శ్రీనాధు డనువాడ శివ భక్తి పరుడ
శాశ్వతంబైనట్టి సద్ గ్రంధ మొకటి
చెప్పబూనీ మనసు చెలరేగియుండ
-------++++++++++++++-
చెన్నకేశవు డప్పుడు దానిట్టు లనయె;
" సౌర్యంబు పుణ్యంబు సమకూర్చునట్టి
పలనాటి వీరుల భాగవతంబు
ప్రకటితంబుగ నీవు రచియించి మాకు
నంకితం బొనరింప ననువొందు చూవె"
----------------------++
మంజరీ ద్విపదగా మన్నించి నేను
చెప్ప బూనితి వచః శ్రీలు మెఱయంగ;
శ్రీకంఠు పరమేశు శివు నాత్మ దలచి
పార్వతీ దేవికి భావించి మ్రొక్కి
శివగణంబుల నెల్ల చితించి పొగడి
ప్రాకటంబుగ విష్ణు ప్రార్ధనల్ జేసి
-----+++-------+-----+++
చెప్ప నేర్చిన వాడ చెలగి మాచర్ల
చెన్నకేశవ స్వామి సేవ నిరతుండ
వలను భారద్వాజ వంశ వర్ధనుడ
కవిసార్వభౌముడన్ ఘనత గన్నట్టి
శ్రీనాధు డనువాడ శివ భక్తి పరుడ
శాశ్వతంబైనట్టి సద్ గ్రంధ మొకటి
చెప్పబూనీ మనసు చెలరేగియుండ
-------++++++++++++++-
చెన్నకేశవు డప్పుడు దానిట్టు లనయె;
" సౌర్యంబు పుణ్యంబు సమకూర్చునట్టి
పలనాటి వీరుల భాగవతంబు
ప్రకటితంబుగ నీవు రచియించి మాకు
నంకితం బొనరింప ననువొందు చూవె"
----------------------++
మంజరీ ద్విపదగా మన్నించి నేను
చెప్ప బూనితి వచః శ్రీలు మెఱయంగ;
రెండవ కురు పాండవ యుధ్ధము గా తెలుగు నాట ప్రసిధ్ధినందిన పలనాటి వీరచరిత్రమును మంజరీ ద్విపదలో రచించిన ఘనుఁడు శ్రీనాధుఁడు. కవిసార్వభౌమునిగా , ప్రౌఢ కవిగా పేరొందిన శ్రీనాధ మహాకవి సులభాతి సులభమై పామరలకు గూడ వేద్యమై యొప్పారు చున్న నిట్టిగ్రంధ మును అమ్మహనీయుడొనర్చుట యబ్బుర పాటు నొనరింపక మానదు. పైగా మాచర్లలో వెవసిన చెన్నకేశ్వర స్వామి తనకు కలలో గనిపించి పలనాటి భారతమునా పేరొందిన పలనాటి వీరులకధ ,ద్విపద లో కావ్యముగా వ్రాసి తనకంకితమొసంగ గోరెనట! ఆహా శ్రీనాధుడెంత ధన్యుఁడు. విష్ణుదేవుని దర్శన భాగ్యము నందెను.
శ్రీనాధుని వంటి మహాకవి యింత దిగువకు వచ్చి ద్విపదలో కావ్య మేలవ్రాయవలెను? గొప్పప్రౌఢగ్రంధమునే వ్రాయవచ్చునుగదా? యనుసందేహము మనంబందు గలుగక మానదు. దానికి ముందుగా నాటికి తెలుగు నాట గల రాజకీయ పరిస్ధితులను బాగుగా బరిశీలింప వలసియున్నది.
శ్రీశైలమునుండి తిరిగి వచ్చునప్పటికి తెలుగునాట పరిస్ధితులుతారుమారైనవి. ఒడ్డెరాజుల చేతిలో రెడ్డి రాజులు ఓటమిని బొందిరి . ఒడ్డెరాజుల పాలన లోనికి రెడ్జిరాజ్యమంతయు వచ్చినది. ఆవేమారెడ్డి , మున్నగువారేమయ్యిరో నూహింప నశక్యము. పాపము కవిసార్వభౌముని నడుము విరిగి నట్లయినది. ఇంతటితో నేటికీ ప్రసంగమును నిల్వరింతము రేపుతక్కినది. సెలవు
శ్రీశైలమునుండి తిరిగి వచ్చునప్పటికి తెలుగునాట పరిస్ధితులుతారుమారైనవి. ఒడ్డెరాజుల చేతిలో రెడ్డి రాజులు ఓటమిని బొందిరి . ఒడ్డెరాజుల పాలన లోనికి రెడ్జిరాజ్యమంతయు వచ్చినది. ఆవేమారెడ్డి , మున్నగువారేమయ్యిరో నూహింప నశక్యము. పాపము కవిసార్వభౌముని నడుము విరిగి నట్లయినది. ఇంతటితో నేటికీ ప్రసంగమును నిల్వరింతము రేపుతక్కినది. సెలవు
No comments:
Post a Comment