కవిసార్వభౌముఁడు శ్రీనాధుఁడు
ఉ: బాల రసాల, సాల, నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి తత్పడుపు కూడు భుజించుట కంటె,సత్కవుల్ ,
హాలికు లైన నేమి గహనాంతర సీమల కంద మూల గౌ
ధ్ధాలికు లైన నేమి? నిజ దార సుతోదర పోషణార్ధ మై;
హాలికు లైన నేమి గహనాంతర సీమల కంద మూల గౌ
ధ్ధాలికు లైన నేమి? నిజ దార సుతోదర పోషణార్ధ మై;
ఈపద్యం నిన్న పరస్థావిచుకొన్నాము. దీనికి ప్రతిదార్ధం యెవరైనా చెప్పగలరు . దీనివెనకాల విడిది చేసిన విశేషాలను యెవరు చెప్పగలరు? అందుకనియే ముందుకేగక నీపద్యము కడ నాగవలసి వచ్చినది. పోతనను"హాలికులకు సేమమా యనుచు మేలమాడు నెపమున శ్రీనాధుఁడాతని దారిద్ర్యము ను వెక్కిరించెను. అది పోతవ్నకు చెప్పరానియంత యాగ్రహ కారణ మైనది. అతఁడు సాత్వికుఁడగుటచే, కఠినముగా గాక మెత్తని మాటలతోనే యతని యహంకారమునకు తగిన సమాధానము నొసంగ నెంచెను. దానిప్రతి రూపమే ఈపద్యము. ఇందు కావ్యము నవయువ కన్యవంటిదని దాని నోలికాసపడి నీచులకమ్మి యాధనముతో జీవించుట పడుపు కూడు దినుట కన్న నికృష్టమని, యంతకన్న నాలుబిడ్డలపోషణకై నాగలి నాశ్రయించుట శ్రేయమని కాకున్న యాటవిక వృత్తితో యడవులకేగి కంద మూలముల దినిబ్రతుకుట మేలని చెప్పుట పైకి గనవచ్చు విశేషము .ఇకవ్యంగ్యముగానతనిని పోతన వెక్కిరించినాడు. యెట్లన-
కావ్యమును పోతన గున్నమావిచిగురులవలె మృదువై సుస్నిగ్ధమై విలసిల్లు, లావణ్యవతియగు కన్యగా,(నవోఢగా -కొత్తపెళ్ళికూతురు) నుపమించు చున్నాడు .అట్టి కన్యను గన్న తండ్రి యేమిచేయవలె? యోగ్యుఁడయిన వరుని వెదకి దెచ్చి పెండ్లి సేయవలె, అదియతనికర్తవ్యము. అట్లుగాక కూళల కమ్మినచో నాద్రవ్యము పడుపు ద్రవ్య మగునుగదా! దానితో జీవింపనెంచుట నీచాతినీచము . కావ్యమును నీచప్రభుల కంకిత మొసగి జీవించుటయు నట్టిదేకదా? మరి సుఖలోలుపుఁడై శ్రీనాధుఁడొనర్చు ఘనకార్య మదియేగదా! యిపుడేమయినది? తనయస్త్రము తనకే తగిలినది. ఉండేలు దెబ్బదిన్న పక్షివలె శ్రీనాధుఁడు లోలోన గింజుకున్నాడు. అపుడేయయినదా? కాలేదు. నీకన్న వ్యవసాయమొనరించుచు యుత్తమ జీవితమును గడపుచున్న నేనే యుత్తముఁడను. నాకావ్యమాపరాత్పరుఁడగు రామచంద్రునకే యంకిత మిత్తునుగాని, నీదుర్బోధలకులొంగి రాజాంకిత మొనరింప నని చెప్పకనే చెప్పినట్లయినది. ఇపుడవమానమెవరికాయెను? శ్రీనాధునకేగదా! పోతన దెబ్బయంతటిది! బావమాటలకు మారు బల్కనోపక కవిసార్వభౌముఁడు తలవంచుకొని లోనికేగెను.
నాటిరేయి భోజనానంతరము పోతన శ్రావ్యముగా తన భాగవతమును జదువుచుండ, శ్రీనాధుఁడు పరవశుఁడైవినుచుండెను. గజేంద్రమోక్షణ ఘట్టమున ప్రాణ భీతుఁడై కరిరాజు దీనాతిదీనముగా నాశ్రీహరిని ప్రార్ధించుటయు, శ్రీహరియాసమయమున :-
మ: అల వైకుంఠ పురంబులో, నగరిలో, నామూల సౌధంబు, దా
పల , మందార వనాంత రామృతసరః ప్రాంతేందు కాంతో
త్పల పర్యంక రమావినోదియగు, నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి!పాహి! యన, గుయ్యాలించి , సంరంభియై ; యనుపద్యమునుచదివి, యావెనువెంటనే -
పల , మందార వనాంత రామృతసరః ప్రాంతేందు కాంతో
త్పల పర్యంక రమావినోదియగు, నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి!పాహి! యన, గుయ్యాలించి , సంరంభియై ; యనుపద్యమునుచదివి, యావెనువెంటనే -
మ: సిరికిం జెప్పఁడు; శంఖ, చక్ర , యగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీర, డభ్రగ పతిం బన్నింపఁ డాకర్ణికాం
తరధమ్మల్లముఁజక్కనొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరి చేలాంచల మైన వీడఁడు; గజః ప్రాణావనో త్సాహియై!
పరివారంబును జీర, డభ్రగ పతిం బన్నింపఁ డాకర్ణికాం
తరధమ్మల్లముఁజక్కనొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరి చేలాంచల మైన వీడఁడు; గజః ప్రాణావనో త్సాహియై!
అని యనంతర పద్యమును జదువగా నవాశముకొరకు గాచుకొవియున్న శ్రీనాధుఁడు పక పక నవ్వుచు, ఇదేమి? బావగారూ! మీశ్రీహరిని నిరాయుధునిగాఁజేసిబంపుచున్నారేమి? ఆయుధ రహితుఁడై యతడట మకరినెట్లు రక్షింప గలడని వెక్కిరించెనట! ప్రొద్దు బోయినదిక నిద్ర కుపక్రమించుడు తక్కినది తరువాత విన వచ్చునని శ్రీనాధ సోదరి హెచ్చరింప నానాటిరేయి నిదురింప నేగిరట!
మనముగూడ యలసినారము నేటికి కింక చాలును తక్కినది రేపు విందము నేటికి సెలవు.!
No comments:
Post a Comment