కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు
శా: కుల్లాయుంచితిఁ, గోకఁ జుట్టితి, మహా కుర్పాసమున్ దొడ్గితిన్,
వెల్లుల్లిన్, దిల పిష్టమున్ మెసవితిన్, విస్వస్త వడ్డింపగా,
చల్లా యంబలిఁ ద్రావితిన్, రుచుల దోసంబంచుఁ బోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను, శ్రీనాధుఁడన్;
అంతములేని యానిరీక్షణమునకు శ్రీనాధునకు విసుగు జనించినది. యేమైన నాయె నని తలంచి యాతఁడు పైపద్యమును రచియించి ప్ర భువుల కంపి తనదీన గాధను పరోక్షముగా వారికి విన్న వించెను. విజయ నగర ప్రభుదర్శనార్ధియై విచ్చేసిన తానెన్ని బాధలనెదుర్కొను చున్నాడో యీపద్యమున పొందుపరచినాఁడు. పద్యము యెత్తుగడలో తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! పదములనువాడుట, చివరిలో నేను శ్రీనాధుడన్; అనుపదములతో ముగించుట, యతనిచాతుర్యమునకు, యతని గొప్పదనమునకు సూచనలైనవి;
విజయ నగరమున శ్రీనాధ కవీంద్రునకు గల్గిన కష్టములివి;1 కుల్లాయుంచుట, కోకచుట్టుట- పెద్దతలపాగ ధరించి దానిపైన యలంకరణార్ధమై తురాయి యను కుచ్చును బెట్టుట కన్నడీయులయాచారము. అదివారి నాగరిక వేషధారణలో నొకభాగము. నదీతీరవాసియై పిలక జుట్టుతో, శిరమొప్పుచు గాలివిస్రారముగా ననుభవించు నవకాశముగల యతనికి సంభవిచిన మొదటి కష్టము; అయినను రాజదర్శనార్ధియై ధరించినాఁడు.2మహాకుర్పాసమున్ దొడిగినాడట - కుర్పాసమనగా చొక్కా! పెద్ద పొడవైన చొక్కాదొడిగినాడు.( ెషేర్వాణీ) 3 వెల్లల్లిన్+ తిలపిష్టమున్ మెసవినాడట - వెల్లల్లి, తెలకపిండి సదాచారపరాయణులకు నిషేధమే! అయినను తినవలసి వచ్చినది. తప్పదు ప్రాంతీయమైనవంటకములలో వెల్లల్లియు తెలకపిండియు కన్నడ దేశమున తరచుగాశాకములలో వాడుచుందురు. యతడున్నదా పూటకూటింట యట నలుగురికొరకు ఒకేవంట నిర్వహింతురు. అదివలదన్న పచ్చడిమెతుకులే గతి; 4 వస్వస్తవడ్డింపగా తినుట యొకటి, సదాచారపరాయణులు(పూర్వపుమాట) విధవాచేతిభోజనమును ముట్టెడివారుకారు. అదియేమి యన్నింటికి పనికివచ్చెడు నాయబలలు భోజనము వడ్డించుట కేలపనికిరారు? యనిమీలోనెవరైన ప్రశ్నింప వచ్చును అప్పటి విధానమది యనిచెప్పి తప్పుకొన వచ్చును; కానీనాఁటియాచార వ్యవహారములను మీరెరుంగుట యవసరము.
నాడువారు రెండు రీతులుగా విభ దజింప బడినారు. సకేశి - వికేశి లుగా. వికేసి వడ్డనకు వంటకు విహితము . సకేశికి నిషేధము. ఆతీరుగాఁజేసినచో నందరు వికేశిత్వమును పొందగలరని వారుభావించిరేమో?"తలలు బోడులైనతలపులు బోడులా యనహేళన చేసినాడు వేమన . ఐనను నేఁటికిని కొందరు ఛాందసులు మారలేదు. అదివారిఖర్మము .ఇకశ్రీనాధుఁడు నివసించిన పూటకూటింట వంటవార్పులు చేసి వడ్డించునది సకేసి .అదీయాతనికి గల్గిన కష్టము 4 చల్లా యంబలిద్రావెనట- పలుచని మజ్జిగ తోకూడిన రాగిజావను త్రాగవలసి వచ్చెను. అదిరాయలసీమవారి భోజనము . రాగిలేనిదే వారికి పూటగడువదు. పలనాటివారికి జొన్నలెంతో, రాయలసీమవారికి రాగులంత. ప్రాంతీయ ఆహారము లట్లేయుండునుగదా! సన్నని వరి బియ్యపన్నమును దిను శ్రీనాధునకు నిదిరుచించకుడుట సహజమే! 5రుచుల దోషంబంచు పోవిడిచెనట! యచటి పదార్ధములేవియు నతనికి రుచించుటలేదు. వేరుదారిలేదు. కావున అశక్త వైరాగ్సము నాపాదించుకొన్నాడు .ఇన్ని కష్టముల ననుభవించుచున్నాడు యేల? రాయల దర్శనార్ధమై, అందుచేతనే తెలివిగా తల్లీకన్నడ రాజ్య లక్ష్మి! యనిసంబోధించినాడు. చివరకు దయలేదా? నేను శ్రీనాధుఁడన్ - మహాభోగపరాయణుఁడను యిట్లయితిని దయచూడవమ్మా! యనివేడుకొను చున్నాడు.
శ్రీనాధ కవీంద్రుని ఈవిన్నపము కర్ణాటప్రభువుల చిత్తమును మెత్తన గావించినది. వారాలోచనలో పడినారు. ఇదియేమి? చారులు, మిత్రులు దెలుపు సమాచారమొకతీరుగ నుంన్నది. యతనితీరును బరిశీలింపగా వేరుగా నగపడుచున్నది. యతఁడు వేగరి యనుట యసత్యమై యుండనోపును. యతడొక సత్కవి గానోపును. రాజసత్కారమునకై వేచియుండెనేమో? జాగొనరించిన యొకసత్కవి నవమానమొనరించిన యపకీర్తకి విజయ నగర ప్రభులు భాజను లగుదురు. కావున నట్టి నష్టమును నివారించుటకైృయతనిని బిలిపింపక తప్పదు. అనియాంతరమున రాయల యాలోచనములు సాగుచునే యున్నవి . రోజులాగవుగదా! వానిగమనము వానిదే; శ్రీనాధుఁడూరకుండునా? మరియొక లేఖాస్త్రమును సంధించినాఁడు
సీ: డంబు సూపి ధరాతలంబుపైఁ దిరుగాడు
కవి మీద గాని నాకవచ మేయ ;
దుష్ప్ర యోగంబుల దొరకొనిఁ జెప్పెడు
కవి శిరస్సున గాని కాలు చాప;
చదివిఁ జెప్పగ నేర్చి సభయందు విలసిల్లు
కవి నోరుగాని వ్రక్కలుగ దన్న;
సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు
కవుల రొమ్ములగాని కాల్చి విడువ;
గీ: దంట కవులకు బలువైన యిటిమగడ!
గవుల వాదంబు విన వేడ్కఁ గలిగె నేని,
నన్ను బిలిపింపు మాస్థాన సన్నిధికిని
లక్ష ణోపేంద్ర! ప్రౌఢ రాయ క్షితీంద్ర!
యని రాయలకు సవాలు విసిరినాడు. ఆసవాలు పనిచేసినది. రాయలు పరివారమునగల యమాత్యులను, పండితులను బిలిపించినాడు. " శ్రీనాధుని గూఢ చారిగా చెప్పితిరే? యేమిది? ఈలేఖనుబరికింపుడు. యతఁడొక కవిమాత్రుఁడే! యతనికి మనయాస్థానమున గల పండితులతో వాదము సలుప వలయునను కోరికయున్నదని యీలేఖ స్పష్టపరచు చున్నది. మీయభిప్రాయమేమి" యనిబలికెను. తక్కినవారు మిన్నకుండ, త్రిపురారి మంత్రి సత్తముఁడు లేచి వినమిత గాత్రుఁడయి రాయల కిట్లు విన్నవించెను. ప్రభూ! లేఖ నాసాంతము చదివితిని యేమాతని ప్రల్లదము! విజయనగరము గొడ్డువోయెనా? ఆపాటి పండిత కవులిచటలేరా! మన" కవిసార్వ భౌముఁడొక్కడు చాలడా ? వాదమున పలాయనమును చిక్తగింపక తప్పదు. రమ్మని యతనిని యాహ్వానింపుడు. పండితమ్మానియగు నాతని నుదుట విజయ నగర ప్రభు సమక్షమున పరాజయము వ్రాసి యున్నదేమో? చూతముగాక! యెచులైనను తమకు సురుచిరమైన ఖ్యాతిలభంపక తప్పదని" పల్కెను. డిండిమభట్టారకుడు కుక్కిన పేనువలె చేష్టలుడిగి చదిగిలఁ బడినాఁడు.
నేటి కింతటి తో విరమింతము రేపు వాద ప్రవాదములను గూర్చి విందముగాక!
నేటికిక సెలవు;

No comments:
Post a Comment