కవి సార్వ భౌముడు శ్రీ నా ధుఁ డు
విజయ ప్రస్థానము
చ: విజయము నిన్ వరించుత! వివేక విహీనుని గౌడ ఢింఢిమున్
స్వజనము లీసడింపగను శాంతము నొందుత నీమనంబికన్;
అజుని వరాళి వాణి, నిను నందలమందు వసింపఁ జేయుతన్;
సుజన మనోభి రాముఁడన చూతుము గాక మనోముదంబుగన్;
స్వజనము లీసడింపగను శాంతము నొందుత నీమనంబికన్;
అజుని వరాళి వాణి, నిను నందలమందు వసింపఁ జేయుతన్;
సుజన మనోభి రాముఁడన చూతుము గాక మనోముదంబుగన్;
కం: కవి సార్వ భౌమ బిరుదం
బవితధముగ నిన్వరించు నార్యులు మెచ్చన్,
కవిజన హృదయామోదం
బవిరళ మగుఁగాక! నాంధ్ర రాజ్యము లందున్ ;
బవితధముగ నిన్వరించు నార్యులు మెచ్చన్,
కవిజన హృదయామోదం
బవిరళ మగుఁగాక! నాంధ్ర రాజ్యము లందున్ ;
గీ; అజుని రాణి సరస్వతి యనుసరింప
వెడలుచున్నావు నీదెయౌ విజయ మరయ
విశ్వ విఖ్యాతి నొందెద విది నిజంబు
పోయిరావోయి మిత్రమా! పొంద శుభము!
వెడలుచున్నావు నీదెయౌ విజయ మరయ
విశ్వ విఖ్యాతి నొందెద విది నిజంబు
పోయిరావోయి మిత్రమా! పొంద శుభము!
అని మిత్రుఁడు మనసార దీవింపదీవింప , జయముఁ దెలుప హర్ష పులకిత గాత్రుఁడై వల్లభుని బిగియార కౌంగిలించుకొని, నీవాక్య మెన్నటికిని వృధగాదు, కారాదు , రేపటి రేపకడ నాప్రయాణమునకుఁదగినయేర్పాటులొనరింపుమని బలికి నాటికి వజ్ఝల యింటికేగెను. ప్రత్యూష కాలమున నిదుర లేచి కాల్యములను నిర్వర్తించి, మిత్రుఁడు వల్లభామాత్యుఁడు ఘనముగా వీడ్కోలు పలుక , పరిమిత పరివారుండై శ్రీనాధమహాకవి విజయనగర మార్గమున విజయ ప్రస్థానము నారంభించెను'.
విజిగీష తనకన్న ముందే పరుగు లెత్తుచుండ శ్రీనాధుఁడు మార్గ మధ్యమున తడవు సేయక గమనవేగము నతిశయింప జేసెను. ప్రయాణము సుఖవంతముగా సాగుచుండెను. మజిలీలలో వారికి వలసిన సదుపాయములను అంతకు మున్నే వల్లభామాత్యుఁడొనరించి యుంటచే నిరాయాసముగ శ్రీనాధుని విజయ ప్రస్థానము సాగుచుండెను. కతిపయ ప్రయాణముల శ్రీనాధుఁడు శ్రీమద్విద్యా నగరమునకుఁజేరేను. విజయ నగరమునకు విద్యానగరమను నామాంతరము గలదు. శ్రీ విద్యారణ్య స్వామి
హిందూసామ్రాజ్య సంస్ధాపన జేయగోరి తుంగ భద్రానదీతీరమున నొక మహా నగర నిర్మాణమునకు రూపు రేఖలు దిద్దినాఁడు. అందుచేతనే దీనికి విద్యానగరమను నామాంతర మేర్పడినది.
హిందూసామ్రాజ్య సంస్ధాపన జేయగోరి తుంగ భద్రానదీతీరమున నొక మహా నగర నిర్మాణమునకు రూపు రేఖలు దిద్దినాఁడు. అందుచేతనే దీనికి విద్యానగరమను నామాంతర మేర్పడినది.
అమ్మహాకార్య నిర్వహణమునకు హరిహర, బుక్కరాయ సోదరులను విద్యారణ్యుఁడు నియమించినాడు. వీరు సంగవ వంశమునకు జెందిన క్షత్రియులు. అందు హరిహర రాయలకే తొలిసారిగా రాజ్యాధికారము. మహాశౌర్యనిధియగు నమ్మహనీయునికే " ప్రౌఢ దేవరాయ" బిరుదము గలదని చరిత్ర కారుల యభిప్రాయము. మనశ్రీనాధకవి యిప్పుఁడాతనియాస్ధానమునకే యరుదెంచినాడు ..
ఒరవూరి రాజు మరియొక వూరికి బంటు - సామెతలు ప్రజలలోనుండియే పుట్టుచుండును. పాపము! శ్రీనాధుఁడావిజయనగరమున పల్కరించువారు కరవై నివ్వెర వోయెను. కొండవీటి విద్యాధికారికి కొండనాలుక బిగిసినది. ఏమిచేయవలె, యెవ్వరినాశ్రయింపవలె, పాలుపోలేదు. నాడు రెడ్డిరాజులు విజయనగరమువారికి శతృకోటిలో చేరినవారగుట యతనిననుసరించి గుప్తముగా వేఁగరులు అనుసరింపసాగిరి. ఈవిషయములన్నియు సంగ్రహముగా వల్లభుఁడెరిగించి యున్నాడు. కావున దిటవు వహించి విజయ నగరమున నొక పూటకూటియింట సపరివారుఁడై విడిది చేసెను. ఓపుగంటి సదుపాయములచట గానరావు. శ్రీనాధున కేమున్నను లేకున్నను ,భోజనసుఖము, శయన సుఖములకు లోటుండరాదు. వాటికే యిచటలోపము. దేశమును బట్టి యాహార మునందు భేదములేర్పడు చుండును. ఇక శయనమునకా క్రొత్తగా తోడువెదుకుకొనవలసి యున్నది.
ఇట్టి చికాకుల లోబడి శ్రీనాధుఁడు వంతనొందుచు, విజయ నగర ప్రభువుల దర్శనమునకై తనవంతు ప్రయత్నము తాను చేయసాగెను. ప్రక్కరాజ్యమునుండి గూఢచర్యమునకు వచ్చెననుపుకారు అప్పటికే ఊరిలోనెగబ్రాకెను. డింఢిముఁడు శ్రీనాధుని ప్రాగల్భ్యము నెరింగిన వాడగుటచే నెటులైన నాతనిబారినుండి తప్పించుకొను ప్రయత్నములోఁబడినాడు . ఇట్టి కారణములచే రాజదర్శన భాగ్య మాలస్య మగుచున్నది.
నేటి కింతటితో నీప్రసంగమును విరమింతము.రేపు తక్కిన విషయములు ముచ్చటించుకొందము. నేటికి సెలవు !
No comments:
Post a Comment