కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
గీ: కంఠ పట్టిక నోంకార ఘంట మొరయ,
జెలఁగుఁ గావుత ! మన్మనః క్షేత్రసీమఁ ,
గవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి ,
జలజ సంభవు బోటి , భాషా వధూటి !
జెలఁగుఁ గావుత ! మన్మనః క్షేత్రసీమఁ ,
గవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి ,
జలజ సంభవు బోటి , భాషా వధూటి !
భావము:- కవికుటుంబాల పాలిటికి కామధేనువై విలసిల్లు , జలజ సంభవుని(బ్రహ్మ) గృహరాణి యగు
వాగ్దేవి, కంఠమున నోంకారము ఘంటయై మ్రోగ నామనోక్షేత్రమందు వసించుగాక! ఆయమవాక్ స్థానమున నిలచి నన్ననుగ్రహించు గాక! యనిభావము.
వాగ్దేవి, కంఠమున నోంకారము ఘంటయై మ్రోగ నామనోక్షేత్రమందు వసించుగాక! ఆయమవాక్ స్థానమున నిలచి నన్ననుగ్రహించు గాక! యనిభావము.
మరునాడు శ్రీనాధుఁడు ఉషోదయ కాలమున నిదురలేచి కాల్య కరణ ములను నిర్వర్తించి పరదేవతా ధ్యాననిమగ్నుఁడయ్యెను. అంతలో నతడూహించిన తీరుగనే రాజాస్థానము నుండి రాయలవారి యాహ్వానమందెను. " శ్రీమన్మహా మండలాధీశ్వర , రాజాధిరాజ, మూరురాయరగండ, విజయ నగర సామ్రాజ్య మహాసార్వ భౌమ కర్ణాటాధీశ్వర, ప్రౌఢదేవ మహారాయలవారు , సగౌరవముగా, శ్రీ శ్రీనాధ కవీశ్వరుల కంపించిన యాహ్వానము.
కొండవీటి విద్యాధికారులును, మహాకవితల్లజులును , నగు తమరు మానగరమునకు విచేచేయుట మాకు ముదావహము. మీవంటి కవిపండితులను సత్కరించుట మాయదృష్టముగా నెంచుచున్నారము . తాము మాసభకు విచ్చేసి తమ కవితాగానముతో మమ్ములనలరించి మాసత్కారమును స్వకరింపఁ గోరుచున్నారము. ఇదియే తమకు మా యాహ్వానము.
కొండవీటి విద్యాధికారులును, మహాకవితల్లజులును , నగు తమరు మానగరమునకు విచేచేయుట మాకు ముదావహము. మీవంటి కవిపండితులను సత్కరించుట మాయదృష్టముగా నెంచుచున్నారము . తాము మాసభకు విచ్చేసి తమ కవితాగానముతో మమ్ములనలరించి మాసత్కారమును స్వకరింపఁ గోరుచున్నారము. ఇదియే తమకు మా యాహ్వానము.
ఇట్లు ప్రభువుల యనుమతితో -
త్రిపురారి మల్లికార్జనుడు (సచివమండలి- యధ్యక్షుడు )
అనివిలిఖింప బడియున్నది. శ్రీనాధుడు పరమానంద భరితుడైనాడు " శ్రీవారి యాహ్వనమును అంగీకరించితిమి తప్ప వచ్చెదమని ప్రభులకు మనవిచేయుడని " రాజభటులనంపి , తగునాహార్యమును సమకూర్చుకొనుటలో సమాయత్తుఁడయ్యెను .
పెద్ద పెద్ద సరిగంచులు గల పట్టువస్త్ర మును పింజవోసి పంచెగట్టి, పొడవైన కూర్పాసమును దొడిగి పెద్ద తలపాగఁజుట్టి, దానిపై తురాయిసవరించి , విభూతితో త్రిపుండ్రములను సవరించి భృకుటి లోకుంకుమము నలంకరించి మెడలో ముత్యాలహారములు రత్న హారములు రుద్రాక్షమాలలు, నతిశయింపగా రాయలవారంపిన స్వర్ణ పల్యంకిక నలంకరించి పరిమిత శిష్యగణము వేదపఠనము నొనరించుచు నిరుచక్కియల నడువ మహావైభవముగా రాయలవారి సభకు అరుదెంచినాడు.
బ్రహ్మవర్చస్సుతో సుందర మందహాసముతో , గంభీరదృక్కులతో, నరుదెంచుచున్న శ్రీనాధ మహాకవినిగాంచి , రాచమర్యాదలను ప్రక్కకు నెట్టి రాయలు సపరివారుఁడై నెదురేగి సాదరాహ్వానమును పచరించి తోడ్కొనివచ్చి సభలో నుచితాసనమున గూర్చుండఁజేసెను .ఇంచుక తడవు కుల ప్రశ్నాదికములు నడచిన వెనుక, రాయలవారు " శ్రీనాధ కవీంద్రా! తమవంటి విద్వత్కవి శేఖరుఁడు మాసభనలంకరిపఁజేయుట మాయదష్టము. నేడుమాకు సుదినము. తమరేదియో పండిత వివాదార్ధము విచ్చేసినట్లుగానున్నదే! మాసభలో నెవ్వరితో మీవివాదము? తెల్పుఁడన, శ్రీనాధుఁడు గంభీరుఁడై యాసనమునుండి లేచి " రాజా ఎవరో కవిసార్వ భౌములట! గౌడఢిండిమ భచ్టారకుఁడట! తమ సభలోనున్నాడట! మహాపండితుఁట ! అతనితోనే మావివాదము. పిలిపింపుడు. వాదమున గెలిచి నాయాధిక్యతను నిరూపించుకొందును. సకల శాస్త్ర పండితులగు మీరే ఈవివాదమున న్యాయనిర్ణేతలు. నేనోడితినా యిక కవిత్వమను మాటనువిడిచి జీవితాంతము అతనిననుసరింతును. తానోడెనా యహంకారసూచకమగు నాతని కంచు ఢక్కను బగులగొట్టింప వలయును ." అని పలుక రాయలవారు సాభిప్రాయముగా డింఢిముని వంకజూచిరి.
వివాదమెట్లు? జరుపుట.శాస్త్ర వాదమా? కవితావాదమా? యనిరాయలవారు ప్రశ్నింప యెటులైనను సమ్మతమే నని శ్రీనాధుడు బదులు పల్కెను. పాపమా గౌడపండితునకు వివాదమును తప్పించుకొన నుపాయములేమి, విధిలేక శ్రీనాధునితో శాస్త్రవాదమునకు గడంగెను. మీమాంసాశాస్త్రము నవాదమారంభమైనది. ప్రారంభముననే జటిలమైన ప్రశ్నల ననుసంధించుచు శ్రీనాధుడాపండితుని ముప్పుతిప్పల బెట్టసాగెను. వృధ్ధాప్య కారణ మునకొంత, శాస్త్రా భ్యాసము తప్పుటచేకొంత నతడు తడబడ సాగెను. చివరకాయుధ్బటవివాదమున గెలుపు శ్రీనాధుని వరించెను. జితోస్మి! యనిడింఢిముడు చేతులు జోడించెను. శ్రీనాధునిదే విజయమని పండితులేకగ్రీవముగా నిర్ణయించిరి. ఈతీరుగా విజయనగరసభ లో శ్రీనాధవిజయము సంస్ధాపితమయ్యెను.
రాయలు ముసి నవ్వులతో శ్రీనాధునిగాచి కవీంద్రాయికనేమి తమసెలవని పలుక, చేతులు జోడించి, రాజా నాకు డిండిమ భట్టారకునిపై నేమాత్రము పగలేదు. కానీ సాటి పండితులను కవులను తిరస్కరిచువిధమున నొక కంచుఢక్కను మ్రోగించుకొనుచు దిరుగుట నీసడించు చున్నాడను. తక్షణమే కంచుఝక్కను బగుల గొట్టింపుడు. దానితోనాతనియహంకార మడగును, మాకుఊరట లభించును - అనిపలికెను. రాజాజ్ఙతో భటులు కంచుఢక్కను భంజనమొనరింప తలవంచుకొని డిండిముడు సభనుండి నిష్క్రమించెను.
నేటికింతటితో మనప్రసంగమును ముగింతము. రేపుతక్కిన విషయములు సెలవు.
No comments:
Post a Comment