కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు
శా: జోటీ! భారతి! యార్భటిన్ మెరయుమీ! చోద్యంబుగా నేను గ
ర్ణాటాధీశ్వరుఁ బ్రౌఢ దేవ నృపతిన్ ," నాసీర ధాటీ చమూ
కోటీ ఘోటక ధట్టికా ఖురపుటీ కుట్టాక సంఘట్టన
స్ఫోటీ ధూత ధరా రజశ్చకుళి తాంబోధిన్ ప్రశంసించెదన్
ర్ణాటాధీశ్వరుఁ బ్రౌఢ దేవ నృపతిన్ ," నాసీర ధాటీ చమూ
కోటీ ఘోటక ధట్టికా ఖురపుటీ కుట్టాక సంఘట్టన
స్ఫోటీ ధూత ధరా రజశ్చకుళి తాంబోధిన్ ప్రశంసించెదన్
అమ్మా! భారతీ! నావాక్ స్థానమున నిలచి యారభటీ వృత్తిలో వెలువడుచు నన్నను గ్రహింపుము. " పరరాజన్యుల సరిహద్దులను దాటి వారి రాజ్యములను కబళించుటకు పోయెడి విజయనగర సేనాసమూహమునందలి అశ్వసము దాయపు డెక్కల తాకిడికి లేచిన ధరాపరాగము తో సముద్రమును పంకిల(బురద) మొనర్చు చున్న మహావీరుఁడగు విజయనగర సార్వభౌముడగు ప్రౌఢ దేవరాయని వర్ణింప నున్నాను. అనిదీనిభావము అతిశయోక్తి యలంకారము. పరాక్రమ వర్ణన లిట్లే యుండును. ధరాపరాగముచే సముద్రమును గప్పు చున్నాడని వర్ణింప బడుటచే రాయల రాజ్యము నకు సముద్రమే యెల్లగా( సరహద్దు) స్పష్టము.
ఇట్టిపద్యములను రాయల వారిపై పరశ్శతములుగావ ర్షించి, శ్రీనాధుఁడు రాయలవారిని కవితాభిషేకముతో నలరించి నాడు. ఇట్లురాయలు కనకాభిషేకమున, శ్రీనాధుఁడు కవితాభిషేకమున నొండొరులను సంభావించు కొనినారు. దానితో నాటి సభ ముగిసినది. శ్రీనాధవితరణమునకు పాత్రులయిన పండితులు, కవులు పరమ సంతుష్టులైరి యానందమున వారిముఖ ముఖ పద్మ ములు వికసించినవి. కాశీఖండము అవతారికలోని " కర్ణాటదేశ కటక పద్మ వనహేళి ! శ్రీనాధ భట్టసుకవి" అనుప్రయోగమునకుగల యర్ధమిదియే! ఇంతకధ నడచిన గాని యాప్రయోగమునకు గలయర్ధము మనకు బోధపడ జాలదు. రాయల సభలో శ్రీనాధకవిఁ జెప్పన పద్యములలో పైపద్య మొక్కటియే దొరకు చున్నది . తక్కిన వన్నియు గాలిలోఁగలసిపోయినవి; రాజసభామర్యాదలను ( ప్రొటోకాల్) పాటింపవలసి యుండుటచే శిష్యగణము దూరముగానుండుట, విజయ ధ్వానముల నడుమ వినరాకుండుట, ఆశువు మిగుల వేగముగా నడచుట, కారణములు గా నాపద్యరాసి యంతయు కాల వారాసి పాలయినది. ఇట్లు శ్రీనాధ కవిసార్వ భౌముని విజయ ప్రస్ధానము ముగిసినది. రాయలవారిచేతను, రాజపరివారము చేతను ఘనమైన వీడ్కోలు నంది. వల్లభుని తండ్రి యగు త్రిపురారి మల్లికార్జునామాత్యునకు కృతజఙతలుఁదెలిపి కవిసార్వభౌముడు సశిష్యుడై స్వదేశమునకు గమనమును సాగించెను.
ఇదీ శ్రీనాధ జీవిత ప్రస్థానము గల విజయ ప్రస్థాన గాధ
నిన్న ప్రసంగ వశమున విశ్వ నాధ వారి వితరణమును గురించి ప్రస్థావించితిని గదా! అదియిందు అప్రస్తుతమే యైనను, యేకాలమువారైనను ఉదారులగు కవుల మనస్త్వములు , వారియౌదార్య గుణగరిమము నెరుంగుటకు నుపకరించును. కావున పాఠకులకు తప్పక మనవిసేతును. వినుడు.
విశ్వ నాధ వారి యౌదార్య గరిమ :- కవిసామ్రాట్ విశ్వనాధ కరీంమ్ నగమున ప్రభుత్వ కళాశాల ప్రిన్స్ పాల్ గాపనిచేస్తున్న కాలంలో సారస్వతాభిమాను లందరు జగిత్యాలలో నొక పండిత సభ జరిపి విశ్వనాధను సన్మానించి పది వేల రూపాయలను కానుగా నిచ్చినారట! సభానంతరము సత్యనారాయణ గారా పదివేలను జేబులో భద్రపరచుకొని కారెక్కినారు. మధ్యేమార్గమునగల ధర్మ పురిలో నృసింహ స్వామి దర్శనార్ధియై దేవాలయమున ప్రవేశంచిగా, నచ్చటి దేవళ ముఖమండపమున కొంతమంది విప్రులు శ్రావ్యముగా వేదపఠనమొనర్ప సాగినారట! ఆవేదనాదములు చెవిని బడినంతనే విశ్వనాధవారు పరవశులై కన్నులరమూడడ్చి, యట్టేనిలబడిపోయినారట. ఒక గంట పర్యంత మావేదపఠనము సాగినది. అంతదనుక విశ్వనాధ ఇంచుకయు కదల లేదు వేదపఠనమాగినది . విశ్వనాధ కనులు దెరచినారు. జేబులోని పది వేల రూపాయల కట్టను ఆవేదపండితుల పాదముల కడనునిచి, నమస్కరించి, దేవునిదర్శించి గమ్మున కారెక్కి వెడలినారట! అదీ వారి యౌదార్యములో నొకచిన్న భాగము. అసలైనది వినుడు.
విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్షమునకు జ్ఙానపీఠము అవార్డు వచ్చినది. దానివిలువ లక్షరూపాయలు. ఆకాలపుసొమ్ము దానివిలువ యిప్పటి విలువకు కొన్నిరెట్లు యెక్కుడుగదా! రూపాయలు బ్యాంకులో జమయైనవి. ఇంతలో వారిచిన్ననాటినేస్తం కొల్లిపర సూరయ్యగారి కుమార్తెకు వివాహము కుదిరినది. సూరయ్యగారు ఒకప్పుడు ధనవంతుఁడే కారణాంతరములచే వారికలమి కదలిపోయినది .కలిగినకాలంలో విశ్వ నాధకూడావారి కలిమిని పంచుకొన్నవాఁడే !యేదియేమైనను సూరయ్యగారు విశ్వనాధకడకు ఋణపత్రమునిచ్చి కుమారుని పంపినారు ' బాబయ్యగారికీ ఋణపత్రమిచ్చి, యేబదివేలరూపాయల నడిగి తెమ్మనెను. పాపమాబాలుఁడు ఋణపత్రమును విశ్వ నాధకిచ్చి ప్రక్కగా నిలబడియుండ, విశ్వ నాధ ఋణ పత్రమును జదివిన వెంటనే మహోగ్రుఁడై" యేమిరా ! మీనాన్న నన్ను ఋణములిచ్చువాఁడనియెంచెనా? తనసొమ్మేమయిన నాకడదాచెనా? పొమ్ము పొమ్ము నాకడధనమేమియు లేదు. ఉన్నను ఋణములిచ్చు వ్యాపారినిగాను పొమ్మని కఠినాతి కఠినముగాఁదిట్టి యాపిల్లవానిని వెడలగొట్టెనట !
ఆబాలుఁడు మ్లాన వదనుడై యేగినంతనే తానులేచి బ్యాంకునకేగి యేబదివేలరూపాయలను డ్రాచేసికొని అట్టేయొక జట్కాబండినెక్కి సూరయ్యగారి గ్రామానికి పయనమైతిరట! పిల్లవాడు యిటికేగి జరిగిన విషమును దెలుపు చున్నంతలో విశ్వనాధ రానేవచ్చెనట! వారినిగాంచి యచ్తెరువందుచు సూరయియగారు లోనికి యాహ్వానింపగా వారిని కుశలప్రశ్నాదికములతో నలరించి, యేమిరా! సూరయ్యా! పిల్లకు పెళ్ళికుదిరినదా? పిల్లవాని వివరములు లేమియనియడిగి , యేరా నీకు నాకు నడుమ ఋణమా ?ఋణపత్రమునంపెదవా? మనమధ్య వాటికితావులేదు. నాసంపదనీదికాదా?
ఇదిగోరొక్కము పిల్లదానిపెళ్ళి ఘనముగా జరిపింపుమని బలికి జట్కానెక్కినారట! ఆశ్చర్యముతో సూరయ్యగారు పిల్లలు మూగవోయిరట!
ఇదిగోరొక్కము పిల్లదానిపెళ్ళి ఘనముగా జరిపింపుమని బలికి జట్కానెక్కినారట! ఆశ్చర్యముతో సూరయ్యగారు పిల్లలు మూగవోయిరట!
అవార్డులో నింకను యేబదివేలరూపాయలుమిగిలినవి . యింటికి రావడమేతడవు ఒకక్షణము ఆలోచించి ఆమిగిలినఃద్రవ్యమును వారిస్వగ్రామ మగునిమ్మకూరిలో సిధిలావస్థ లోనున్న దేవాలయ జీర్ణోధ్ధారమునకై విరాళ మంపి నశ్చింతగా కూరుచుండిరట! ఇది సరహస్యము; వారెన్నడును యెక్కడను దీనినిగురించి ప్రస్థావించలేదు . మరిమీరెట్లెరింగిరి? యనిమీరు ప్రశ్నించుటకు సిధ్ధముగా నున్నారుగదా! వినుడు. విశ్వనాధ కుమారుడు పావని శాస్త్రి నానేస్తమగుట ప్రసంగ వశమున నేనెరింగితిని. మీరును మరచిపొండు. మహాత్ముల చరితము లిట్లుండును!
" ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకమ్" జయంతి తేసుకృతినో రస సిధ్ధాః కవీశ్వరాః"
నేటికిక సెలవు రేపు తక్కినది చూచుకొందము .
No comments:
Post a Comment