కవి సార్వ భౌముడు శ్రీనాధుడు
చ: స్మర దివ్యాగమ కోవిదుల్, మదన శిక్షాతంత్ర విద్యా విదుల్,
సురతారంభ మహాధ్వర ప్రవణు , నిచ్చోనుండు వేశ్యావరుల్,
తిరమై నాకు ననుజ్ఙ యిం డిపుడు ' తార్తీయీకమై యొప్పు, న
ప్పురుషార్ధంబు నెఱుంగఁ బోయెదఁ బునర్భూ భామినీ వాటికిన్;
సురతారంభ మహాధ్వర ప్రవణు , నిచ్చోనుండు వేశ్యావరుల్,
తిరమై నాకు ననుజ్ఙ యిం డిపుడు ' తార్తీయీకమై యొప్పు, న
ప్పురుషార్ధంబు నెఱుంగఁ బోయెదఁ బునర్భూ భామినీ వాటికిన్;
మంచన మిత్ర సహితుడై యెట్లో మదనరేఖా ముకుర దర్శన కోలాహలము నుండి తప్పించుకొని, అక్కల వాడకుఁ జేరుకొన్నాడు. పాపమాతనికేమి యెఱుక నంతకు మున్నే యచట నొక విట వ్యాజ్యము విచారణ జరుగు చున్నది. తీర్పు మిగిలి యున్నది. మంచనను జూడగనే వారెగఁబడినారు. తీర్పు చెప్పి, విట ధర్మమునకు విరుధ్ధముగా చరించిన వీరికి తగిన శిక్ష ను విధింపఁగోరినారు . మంచన సామాన్యుడుగాడు. విధర్మ శాస్త్ర కోవిదుడు. తప్పదుగదా! విట ధర్మములు విప్పిచెప్పి వారాంగనలకు వావి వరుస లుండవు. వృధాకలహములను పెంచుకొనకుఁడని వారిని హెచ్చరించి , "మీరుమన్మధ వేద పారంగతులు, మదనతంత్ర శిక్షాదక్షులు. సురతారంభ మహాయజ్ఙ నిర్వహణా దక్షులు, మీరెరుంగని విషములేవిగలవు? నాకానతి నిచ్చినచో, మరియొక వేశ్యావాటికకు బోయి యాతృతీయ పుషార్ధ సాధనకై నాయోపిన కొలది ప్రయత్నించెదను గాక! యనిపలికి మెల్లగా నటనుండి జారుకొని తనప్రేయసి మదన మంజరి యింటికిఁజేరుకొనెను .
ఆకస్మికముగా నరుదెంచిన మంచెనను, అతని మిత్రుని గాంచి మదన మంజరి యచ్చెరువునొంగెను. సంతోషమున నుప్పొంగి ఘనస్వాగగతమును పచరించెను. కొలది విశ్రాంతి యనంతరము యతని మిత్రుడు టిట్టిభ సెట్టి యొకవారాంగనా సంగమమునవిహరింప.
చ: కర పద్మంబునఁ బైడిపళ్ళెరమునన్ గంధాక్షతల్ పచ్చ క
ప్పురమున్ విడెము గొంచు, గ్రొత్తమడుఁగుం బొన్పట్టు నీరంగిలో,
మురిపెం బొప్పఁగ వచ్చె, జౌర్య రత సంభోగార్ధమై , కామ మం
జరి గోవిందుని యొద్దకున్, శివ నమస్కార ఛ్ఛలం బొప్పగన్;
ప్పురమున్ విడెము గొంచు, గ్రొత్తమడుఁగుం బొన్పట్టు నీరంగిలో,
మురిపెం బొప్పఁగ వచ్చె, జౌర్య రత సంభోగార్ధమై , కామ మం
జరి గోవిందుని యొద్దకున్, శివ నమస్కార ఛ్ఛలం బొప్పగన్;
కామ మంజరి బంగారు పళ్ళెరమున గంధాక్షతలు, కర్పూరతాంబూలము, మున్నగు సరంజామాతో, పట్టుపుట్టమును ధరించి సర్వాభరణ విభూషితయై మంచెన సముఖమున కరుదెంచి శివార్పణ మస్తు! యనుచు నతని పాదములపై బడి నమస్కరించు మిషతో నోరగాఁ జూచుచు కిందకు వంగినది. యదే తగిన యదనని యెంచి మంచెన యామె నొడిసి బట్టి యొడికి జేర్చెను . కధ తుదకు సుఖాంతమైనది .
ఆజారదంపతుల చంద్ర పూజాదికములో శుభమస్తు! కళ్యాణ సిధ్ధిరస్త్వను స్వస్తి వాచకములతో నీ వీధీ నాటకమునకు తెఱ పడుచున్నది.
ఇంతకు, నీగ్రంధమునకు క్రీడాభిరామ మను పేరు యెట్లు సార్ధక మగునో యొండు రెండు వాక్య ముల లోవిచారించి ముందుకు బోవుదము. క్రీడల చేత నభిరామ మైనది క్రీడాభి రామ మైనదని, విజ్ఙుల యభిప్రాయము. ఇందేమి క్రీడలు గలవు? గ్రంధ మంతయు క్రీడలే! అవి సురత క్రీడలుగానీ, దేవతా ఉత్సవాదులు గానీ, తిరునాళ్ళ సంబరములు గానీ, అన్నియు క్రీడాస్వరూపములేగదా! అందుచేతనే యది క్రీడాభిరామ మను యభిదకు నోచుకొన్నది. ఇది యొకపక్షము. మరియొకవాదన " ఇది శ్రీనాధమహాకవి కవితా క్రీడకు ఆలవాలము కావున క్రీడాభిరామ మైనది. ఈయిరుపక్షములవాదనలు సముచితము లగుటచే మనమీవాదములను నిర్వివాదముగా స్వీకరించెదముగాక!
ఇట్లీ గ్రంధము పరిమాణమున చిన్నది యైనను, కవితా ప్రాగల్భ్యమున కడుంగడు మిన్నయై యలరారుచు యాంధ్ర భాషాయోష కొక చక్కని యలంకారమై యలరారుచు,జానపద విజ్ఙానమునకు నెలవై, నాటియాంధ్రుల సమస్త జీవన విధానములకు నిధానమై, శ్రీనాధ కవి సార్వ భౌముని శృంగార కళా విజ్ఙానమునకు కాణాచియై యొప్పారు చున్నది.
నేటికింతటితో విరమింతము. ముందుముందు శ్రీనాధుని విజయ ప్రస్థానమునకు మార్గము సుగమ మొనర్ప వలెనుగదా! ఆవిషయములు రేపు ముచ్చ టించు కొందము. సెలవు
No comments:
Post a Comment