శ్లో; శరదిందు వికాస మందహాసామ్
స్ఫుర దిందీపర లోచనాభిరామామ్
అరవింద సమాన సుందరాస్యామ్
అరవిందాసన సుందరీ ముపాస్యే!
స్ఫుర దిందీపర లోచనాభిరామామ్
అరవింద సమాన సుందరాస్యామ్
అరవిందాసన సుందరీ ముపాస్యే!
కవిసార్వ భౌముడు శ్రీనాధుడు
సీ: ఇదె దారు వనభూమి! యసమ నేత్రుఁడు వాఁడె ,
సంయమీంద్రుల పుణ్య సతులు వారె;
సంయమీంద్రుల పుణ్య సతులు వారె;
యదె కన్యకారత్న! మబ్జాసనుఁడు వాఁడె
యదె రతి క్రీడా విహార సెయ్య! ;
వాఁడె వైకుంఠుండుఁ వారె గోపస్త్రీలు ,
యమునా నదీ సైకతాంత మదియె!
యదె రతి క్రీడా విహార సెయ్య! ;
వాఁడె వైకుంఠుండుఁ వారె గోపస్త్రీలు ,
యమునా నదీ సైకతాంత మదియె!
యదె యహల్యాదేవి! యమరాధిపుఁడు వాడె ,
యదె పర్ణశాలికా భ్యంతరంబు !
యదె పర్ణశాలికా భ్యంతరంబు !
గీ: చందురుఁడు వాఁడె యదెబృహస్పతి పురంధ్రి !
జాలరిది యదె ! శ్రీ పరాశరుఁడు వాఁడె !
కుశికజుఁడు వాఁడె! యదె యింద్రు కొలువు లేమ!
చిత్తజుని శౌర్య మెరిగించె చిత్ర శాల;
జాలరిది యదె ! శ్రీ పరాశరుఁడు వాఁడె !
కుశికజుఁడు వాఁడె! యదె యింద్రు కొలువు లేమ!
చిత్తజుని శౌర్య మెరిగించె చిత్ర శాల;
మాచల్దవితో కుశల ప్రశ్నాదికము లయినవి . ఆయమ యింటగల చిత్ర శాలను జూచుటకు లోనికేగినాడు. నాడు సంపన్నుల , లేదా రారాజుల యభ్యంతర మందిరముల వైభోగ మీతీరుగ నుండెడిది. పడక టింటి యలంకరణము ప్రత్యేకము. అందే చిత్ర శాలయు నిర్మితము లగు చుండెడివి. వీనీయందు కుడ్య చిత్రముల ప్రత్యేకత చెప్పుకొనితీరవలెను. శయన గృహమున నలువైపుల విశాలమగు కుడ్యములపై రక రకముల చిత్రములను చిత్రింప జేసుకొనెడివారు. తైలవర్ణ రంజిత మగువానిలో శృంగార చిత్రముల రచన మే హెచ్చు. ఆచిత్రముల దర్శనమునే యీపద్యము వివరించు చున్నది.
ఒక వైపు పరమ శివుని దారుకా వన విహారం మునిపత్నుల సముదాయం తో చిత్రింప బడియుంది. మరియొకవైపు సరస్వతీ యబ్జాసనుల శృంగార విహారము, వేరొకవైపు కృష్ణుడు గోప భామలతో నాడినసయ్యాటలు, యచటి యమునా పులిన తీరములు , ఇంకొక వైపు అహల్యా సంక్రందనుల రహోవిహారములు, అందుకు తోడ్పడిన పర్ణశాలయు, తరాచంద్రుల విహారము లొకవంకను, జాలరి కన్నెతో పరాశరముని సలుపు సరస వీహారము లొకఠేవను, విశ్వామిత్ర మేనకా విహారము లింకొక క్రేవను, చిత్రితములై, యాగృహము మన్మధ విజయ విహారశాలగా రూపొందింప బడెను. మంచనశర్మ చిత్రశాలా చిత్రణను మనసార గొనియాడి యామెను సాదరముగా వీడ్కొని యక్కల వాడకు బయలు దేరెను.
అక్కల వాడలో తనకుపూర్వ పరిచయముగల యిష్ట సఖియగు వేశ్యాగృహంబున కేగెను. ఆగేహము యాతాయాత విటజన సందోహలమై సందడించు చుండెను. అయిన నేమి, చిరకాలమున కరుదెంచిన తన తొలివిటుని యావేశ్యగుర్తు పట్టినది. సంభ్రమాశ్చర్యానందములు ముప్పిరి గొన మంచెనకు ఘన స్వాగతమును పచరించినది. అతడును సంతసించి , యంటనేమీ సందడి? యనియడుగ ,
ఉ: గోత్రము వారలెల్లఁ గెడఁగూడినవారు, వ్రతంబొ? దేవతా
యాత్రయొ? పండువో? మన గృహంబున శోభనమేమి? శోభనం
బత్రి సమాన! నేఁటి యపరాహ్న సమాగమ వేళ , బుష్య న
క్షత్రము నందు , నీయనుఁగు గాదిలి కూఁతురు, చూచు నద్దమున్;
యాత్రయొ? పండువో? మన గృహంబున శోభనమేమి? శోభనం
బత్రి సమాన! నేఁటి యపరాహ్న సమాగమ వేళ , బుష్య న
క్షత్రము నందు , నీయనుఁగు గాదిలి కూఁతురు, చూచు నద్దమున్;
బంధవు లందరూ వచ్చారు యేదయినా శుభ కార్యమా? లేక ప్రతమా? యేమిసంగతి? యని మంచన యడుగ , ఔను నేటి యర్ధ రాత్రమున పుష్యమీ నక్షత్ర యుక్త శుభ ముహూర్తమునందు నీగారాల కూతురు మదన రేఖ " ముకుర వీక్షణ మొనరించును . ఆకార్యమును నీవే నిర్వహింప వలసియున్నది. సమయమునకు వచ్చినావు మాజన్మ ధన్యము గావింపు మనికోరినది. చేయునదేమున్నది విటత్వమన కది తగిన శిక్ష యే!
ముకురవీక్షణం- మన్మధ వేధ దీక్ష లు నాడు వేశ్యలయింట సర్వ సాధారణము. నాటియాచారములవి. ముకురవీక్షణము - అద్దమునందు తనమొగమును చూచుట. వేశ్య కన్నె యీడేరిన పిమ్మట నొకమంచిరోజు చూసి ఈకార్యక్రమమును ఘనముగానిర్వ హింతురు. తండ్రి యొడిలో జేర్చుకొని( తొడపైగూర్చుండ బెట్చుకొని) కూతునకు ముకురమును జూపింపవలెను . ఆపిమ్మట నాశీర్వదించి యేదోయొక కానుక నాకూతున కీయవలె యిదీ యందలి తంతు. దీని యనంతరము మంచిరోజున మన్మధ వేధ దీక్ష యారంభమగును. అది10నాళ్ళు సాగును ఆపదిరోజులలో నామె వచశేఖరులతో గడపవలె. తదనంతర మామె గణికగ పరిగణింప బడును.
ముహూర్త మాసన్నమైనది. మంచెన పీఠిక నధివసించినాడు.
గీ: కేలఁ గ్రొమ్మించు టద్దంబు గీలు కొలిపి
మంచి తొడమీద నొప్పారె మదనరేఖ!
ముద్దు నెమ్మోము లావణ్యమున జయించి,
కువలాప్తుని జెఱవెట్టు కొన్న కరణి;
మంచి తొడమీద నొప్పారె మదనరేఖ!
ముద్దు నెమ్మోము లావణ్యమున జయించి,
కువలాప్తుని జెఱవెట్టు కొన్న కరణి;
అయనది ముకుర వీక్షణము. కానుకగా నొకవెండి నాణెమును సమర్పించుకొని, ఇదె వత్తునని బయటపడినాడు. బయట శ్రీకాకుళ తిరునాళ్ళు జోరుగా సాగుచున్నవి. అప్పటికే చలిముదిరెను. అక్కల వాడలోని మదన మంజరి యింటికి బయలు దేరెను. కవియామాఘ మాసపు చలిలో సైరికుని జీవన మెట్లున్నదో యీచిన్ని పద్యములో వివరించినాడు చిత్తగించండి!
గీ: మాఘ మాసంబు పులువలె మలయు చుండ ,
పచ్చడం బమ్ము కొన్నాడు పసరమునకు,
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు,
చలికి నొఱగొయ కేలుండు సైరికుండు!
పచ్చడం బమ్ము కొన్నాడు పసరమునకు,
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు,
చలికి నొఱగొయ కేలుండు సైరికుండు!
ఆహా యేమిపద్యమిది! శ్రీనాధమహాకవి యెంత సామాజిక స్పృహ గలవాడు! సైరికు డనగా వ్యవసాయము చేయువాడు చేనులో పంటవేసినాడు. చేనికినీరుబెట్ట వలెను మోటగట్టుటకు రెండవ యెద్దు కరవైనది యేమిచేయగలడు? దారిలేక చివరకు చలికి కప్పుకొను దప్పటినమ్మి సరమును కొన్నాడట! మరియాచలిలో నతడెట్లు బ్రతికినట్లు? యాతనిభార్య పాలిండ్లు పొగలేని కుంపటులై యతనిని బ్రతికించు కొన్నవట! నాటికి నేటికీ హాలికుని దురవస్ధల కంతము లేదుగదా!
ధన్యవాదాలు.
ReplyDelete