శ్లో: శరదిందు వికాస మందహాసామ్
స్ఫుర దిందీవర లోచనాభిరామామ్
అరవింద సమాన సుందరాస్యామ్
అరవిందాసన సుందరీ ముపాస్యే!
స్ఫుర దిందీవర లోచనాభిరామామ్
అరవింద సమాన సుందరాస్యామ్
అరవిందాసన సుందరీ ముపాస్యే!
కవిసార్వభౌముడు శ్రీనాధుడు
సీ: పాంధ శీమంతినీ ప్రాణ మత్స్య ములకు
గాలాములగు కంటకములతోడ;
గరుడ పచ్చల చాయ పరిహసింపగ జాలు
దళమైన బాహ్య పత్రములతోడ;
జీర్ణ కీకస కణ శ్రేణిఁ బిడ్డలు జేసి
యవియ దోమినయట్టి యన్నుతోడ;
పదియారువన్నియ బంగారు సరివచ్చు
సంవర్తికా పలాశములతోడ;
గరుడ పచ్చల చాయ పరిహసింపగ జాలు
దళమైన బాహ్య పత్రములతోడ;
జీర్ణ కీకస కణ శ్రేణిఁ బిడ్డలు జేసి
యవియ దోమినయట్టి యన్నుతోడ;
పదియారువన్నియ బంగారు సరివచ్చు
సంవర్తికా పలాశములతోడ;
గీ: శివుని చిచ్చర కంట వెచ్చిన యనంగు
బూదికెయైన కమ్మ బుప్పొళ్ళ తోడ
దావి ఘనమైన గమ్మ గేదంగి పూవు
భూసురున కిచ్చెఁదగ నొక్క పుష్పలావి!
బూదికెయైన కమ్మ బుప్పొళ్ళ తోడ
దావి ఘనమైన గమ్మ గేదంగి పూవు
భూసురున కిచ్చెఁదగ నొక్క పుష్పలావి!
భోజనానంతరము విశ్రాంతిని గైకొని మిత్రులిరువురు పట్టణమున పరిభ్రమణమునకు బయలు దేరినారు. కుత్తుక బంటి మెక్కిరేమో వారికి యలవిగాని నిద్దుర బట్టినది. లేచునప్పటికి ప్రొద్దు వాటారు చుండెను. పురవీధులలో సందడి యినుమ డించినది. ఒకచోపాములాట, మరియొకచో కోజిపందెములు. కొండొకచో పొట్టేళ్ళపందెములు, ఇట్లు కోలాహలము గానుండెను. వారెట్లోయా సందడి నధిగమించి వేశ్యావాటిక వైపు నడక సాగించిరి. దారిలో పుష్పలావికలు మంచన శర్మకు మొగలిపూరేకును కానుకగానొసగినారు. పైసీస పద్యమంతయు నాపుష్ప వర్ణనమే!
వేశ్యావాటికలో నొక సుందర భవనము వారికక్షిగోచరమైనది. ఆభవనమంతయు నత్యంత రమణీయముగా నలంకరింప బడినది. రాజపరివారముతో మిగుల సందడిగానున్నది. మంచన కుతూహల మణచుకొనలేక, యచటి దాసి నొకదాని నడుగ నామె విస్తు పోవుచు,
శా: ద్వీపాంతంబున నుండి వచ్చితివె? భూదేవా! ప్ర శాంతం మహా
పాపం " సర్వ జగత్ప్ర సిధ్ధ సుమనో బాణాస నామ్నాయ వి
ద్యోపాధ్యాయి, ప్రతాప రుద్ర ధరణీ శోపాత్త గోష్ఠీ ప్రతి
ష్ఠాపారీణ! నెరుంగ వయ్యెడవె? మాచల్దేవి వారాంగనన్;
పాపం " సర్వ జగత్ప్ర సిధ్ధ సుమనో బాణాస నామ్నాయ వి
ద్యోపాధ్యాయి, ప్రతాప రుద్ర ధరణీ శోపాత్త గోష్ఠీ ప్రతి
ష్ఠాపారీణ! నెరుంగ వయ్యెడవె? మాచల్దేవి వారాంగనన్;
అహో! భూసురవర్యా! పాపము శమించుగాక! మీదీయూరు కాదాయేమి? నీవెరుగవా? ఈమె ప్రతాప రుద్రమహాసార్వ భౌముని సభకేకీర్తికారణ మైనది. సర్వ మన్మధ వేదంబును బోధింపగల దిట్ట. కామశాస్త్ర ఉపాధ్యాయిని, మహారాజునకు ప్రియురాలు . సకల కళాప్రవీణ! నాట్య కోవిద! యని సవిస్తరముగా తెలిపినది. మహాప్రగల్భుడగు మంచన యూరకుండునా? కావలివారి నాశ్రయించి లోనికి దూరెను.
అట సకల లోక సౌందర్యము మూర్తీ భవించి నట్లున్న నొక సుందరీ రత్నమును గాంచెను. ఆహా యేమాయందము యేమాసౌకుమార్యము? అప్సరో భామినులనుగూడ తలదన్ను నట్లుండెను. అంత ధక్షిణ హస్తమునెత్తి-
గీ: నంకుశాఘాతరేఖల నందమొందు
గంధగజ కుంభ ముల తోడఁగలహ మాడు
క్రొత్త నఖముల తోడి నీకుచ భరమున
కతివ! యభ్యుదయ పరంపరాభివృధ్ధి రస్తు!
గంధగజ కుంభ ముల తోడఁగలహ మాడు
క్రొత్త నఖముల తోడి నీకుచ భరమున
కతివ! యభ్యుదయ పరంపరాభివృధ్ధి రస్తు!
అనిదీవించెను. అంతటితో నాగునాయావాగుడు కాయ! యెటులైన యామెను మెప్పింపదలచి,
గీ: కల్ల జెప్పము విను, నీకు గల ప్రసిధ్ధి
ఢిల్లి సురతాణికిని లేదు పల్ల వోష్ఠి!
యాది లక్ష్మకి నీకును భేద మేమి?
యుదధి జనియించ కుండుట యొకటి దక్క!
ఢిల్లి సురతాణికిని లేదు పల్ల వోష్ఠి!
యాది లక్ష్మకి నీకును భేద మేమి?
యుదధి జనియించ కుండుట యొకటి దక్క!
మే మసత్య మాడుట లేదమ్మా! నీకున్న ప్రసిధ్ధి ఢిల్లీపాదుషహా వారి రాణికిగూడ లేదమ్మా! అసలా యాది లక్ష్మికినీ నీకును భేద మేమి కలదమ్మా! ఆమె సాగరజన్యయా! అది యొక్కటియేగదా! లేనిదేమున్నది? నీకు శభమస్తు! అనంత వైభవ పరంపరాభివృధ్ధి రస్తు! అనియాశీర్వాద పరంపరలు గురియింప నాయమ యానంద తుందిలయై దిగ్గున లేచి యాతని పాదములకు ప్రణమిల్లినది .
No comments:
Post a Comment