Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -3

గీ: ప్రౌఢి బరికింప సంస్కృత భాష యండ్రు;
పలుకు నుడికారమున కాంధ్ర భాష యండ్రు;
ఎవ్వరేమైన నండ్రు గాకేమి గొరత?
నాకవిత్వంబు నిజము కర్ణాట భాష!
కాశీఖండము-అవతారిక :
నిన్న మనం చివరలో సీసం చెప్పుకున్నాం. అందులోచివర "కర్ణాటదేశకటక పద్మవన హేళి శ్రీనాధ భట్ట సుకవి"
పద్యంచివరలో ఉంది. ఈరెండుప్రయోగాలేకాక, విజయనగరానికి వెళ్ళిన సందర్భంలో శ్రీనాధుడు" తల్లీ! కన్నడ రాజ్య
లక్ష్మి! దయలేదా? నేనుశ్రీనాధుడన్!- అనే మూడు ప్రయోగాలు చేశాడు. వాటినిచూసి కొందరు శ్రీనాధుడు కన్నడు డే
నని యభిప్రాయపడినారు .కానీ యదార్ధంపరిశీలిస్తే ఇతడు పాకనాటి నియోగి బాహ్మణుడే!
పూర్వం ప్రతి దేశంలోనూ పండిత పరిషత్తులుండేవి. వాటికి వినయంగా నమస్కరిచటం. కవులకుమర్యాద. "సత్సభాంతర సరసీ వనంబుల ముదం బొనరం గొనియాడి వేడుకన్" అని నన్నయ కూడా భారతావతారికలో వ్రాయటం గమనార్హం; ఆసాంప్రదాయమునే శ్రీనాధుడనుసరించి నాడు. ఇక కన్నడరాజ్య లక్ష్మిని
తల్లీయని సంబోధించుట ఆతిధ్య దేశాన్ని గౌరవించటం తప్ప మరొకటికాదు. అసలు కర్ణాటక శబ్దానికి (శ్రీనాధప్రయోగం) అర్ధంవేరు. దాన్ని దేశ పరంగా గాక, కవిత్వ పరంగా ఆలోచించాలి. " కర్ణే అటతీతి కర్ణాటః-(చెవులలోమారుమ్రోగేభాష కర్ణాటకము) అనిఅర్ధం చెప్పుకుంటే"కర్ణాటక సంగీతంలాగ" చెవులకు వినసొంపయినది.
అనే అర్ధం వస్తుంది. అదే శ్రీనాధుని కర్ణాట పద ప్రయోగంలోనిభావం; ఈవిధంగా సమన్వయపరచి అతడు కన్నడ దేశానికి చెదినవాడు కాదు మనవాడేనని నిర్ధారించారు; హమ్మయ్య! బ్రతికి పోయాం! కవిసార్వ భౌముడు మనవాడే!
ఇఁతటితో నీప్రసక్తినాపి అతని గ్రంధాలను ముందుగా పరిచయం చేసికొని ముందుకు సాగుదాం; అసలురుచిఅతని చాటుపద్యాల దగ్గరవుంది.దానికి మరికొంత వేచియుండక తప్పదు

No comments:

Post a Comment