శ్రీనాధుని రాజకీయ నేపధ్యము
నాటిరెడ్డి రాజ్యమునకు వెన్నెముక కాటయ వేముడు. మహాపరాక్రమ వంతుడు. అరివీర భయంకరుడు. సర్వ సేనా ధ్యక్షుడయిన అతని నేతృత్వములో రెడ్డిరాజ్యము శతృరాజుల దండయాత్రలకు సుదూరమై సుభిక్షమై యుండెడిది.
సీ: దండ యాత్రా ఘోష తమ్మట ధ్వనులచే
గంతులు వేయించె ఁగప్పకొండ;
కితవ కాలాభీల కీలానలము చేత
నేలపొంగడగించె బాలకొండ;
అరజాధట్ట హయ ధట్టములచేత
మట్టి దూర్పెత్తించె బొట్టునూరు;
భూరి ప్రతాపాగ్ని ఁబుటములు బెట్టించె
విదవేషులను గళా(కాళ)వెండిపురము;
గంతులు వేయించె ఁగప్పకొండ;
కితవ కాలాభీల కీలానలము చేత
నేలపొంగడగించె బాలకొండ;
అరజాధట్ట హయ ధట్టములచేత
మట్టి దూర్పెత్తించె బొట్టునూరు;
భూరి ప్రతాపాగ్ని ఁబుటములు బెట్టించె
విదవేషులను గళా(కాళ)వెండిపురము;
తే:గీ: అనగ నుతికెక్కి తౌర! కేళాదిరాయ!
అరుల పండువ మండువా యవన హరణ!
బళియ ధూళియ మాళువ బందికార!
విజయ రఘురామ! అల్లాడ విభుని వేమ!
అరుల పండువ మండువా యవన హరణ!
బళియ ధూళియ మాళువ బందికార!
విజయ రఘురామ! అల్లాడ విభుని వేమ!
ఈపద్యమును బట్టి యతడెంతటి వీరాగ్రేసరుడో అవగతము కాగలదు. ఆవీరుని నీడలోనే కొండవీడు, రాజమహేంద్రవర, రాజ్యములు రెండును విస్తరించినవి. పేరునకు ప్రభువు లున్నను పెత్త్తన మంతయు కాటయవేమునిదే!
కాటయవేముడు తనచాతుర్యముతో తమ్ముడు అల్లాడ వీరభద్రారెడ్డికి అనితల్లితో వివాహమును జరిపించెను. ఆమె కోమటి పెదవేముని భార్యకు చెల్లెలు. అరణముగా రాజమహేంద్రవరమునకు తమ్మని రాజుగానొనరింప జేసెను. అధిరారమంతయు హస్త గతమై కాటయ యధేఛ్ఛగా నుండెను. పెదకోమచి వేముడు గాని, వీరభద్రారెడ్డి గాని పేరుకు ప్రభువులు. వారు అధికారమును చెలాయించిన దాఖలాలు పూజ్యము.
శ్రీనాధుడా బహు చతురుడు నుతులతో కాటయ నాకట్టు కొనెను.ఈపద్యమును పరిశీలింపుడు. దుర్గమమైన శ్లేషలతో గూడి పండితప్రవరులకుగూడ నర్ధము చెప్పుటకు అసాధ్యమై కాటయ వేముని పరాక్రమము వలెదుస్సాధ్యమై యెట్లున్నదో?
ఉ: వీర రసాతిరేక! రణవిశ్రుత! వేమనరేంద్ర! నీయశం
బారభమాన తారకర హార సమానము నీ భుజామహం
బారభమాన తారకరహార సమానము నీ పరాక్రమం
బారభమాన తారకరహార సమానము చిత్రమారయన్;
బారభమాన తారకర హార సమానము నీ భుజామహం
బారభమాన తారకరహార సమానము నీ పరాక్రమం
బారభమాన తారకరహార సమానము చిత్రమారయన్;
రాజమహేంద్రి నేలు వేముని పొగడ్త యిది.ఇందులో "ఆరభమాన తారకరహార సమానము"-అనేపద్య భాగము,మూడుపాదములలో నున్నది. వీనికి విశేష్యములుగా యశము, భుజామహము,పరాక్రమము, లు చెప్పబడినవి. పండితులెందరో కష్టపడి ఏకాక్షరనిఘంటువుల సాయము వలన అర్ధమును రాబట్టినారు. ముందుగా దీనినిఏపాదానికాపాదమే వేరువేరుగా పదఛ్ఛేదము చేసికోవాలి. అప్పుడు అర్ధం అవగతమూతుంది.
2పా:కీర్తిని సూచించునపుడు: అర-పాదరసం; భ- నక్షత్రం; మానతారకర- సాటిలేని వెండివడగళ్ళు; హార-ముత్యాలహారము వలె ప్రకాశించు చున్నదని యర్ధము.
3పా: భుజబలాన్ని ప్రశంసచేయునపుడు, అర-అంగారకుడు; భ-అగ్ని; మాన-పగడం; తారకర- మేరుపర్వతం; హార-బంగారము; వీటితో పోల్చదగినది యని యర్ధమ
4పా; ఆరభమా ఆనత అర కర హా రస మానము అనిుదవి భాగము గావంచినచో ,ఎంగొప్పవారైనా నీముదు వంగి కానుకలు అందించవలసినదే! నీశతృవులందరూ నీముందు హాహాకారములను చేయుచు కరుణరస ప్రయోగముఖులై నిలచి యుండవలసినదే! అను నర్ధము పొసగును.
2పా:కీర్తిని సూచించునపుడు: అర-పాదరసం; భ- నక్షత్రం; మానతారకర- సాటిలేని వెండివడగళ్ళు; హార-ముత్యాలహారము వలె ప్రకాశించు చున్నదని యర్ధము.
3పా: భుజబలాన్ని ప్రశంసచేయునపుడు, అర-అంగారకుడు; భ-అగ్ని; మాన-పగడం; తారకర- మేరుపర్వతం; హార-బంగారము; వీటితో పోల్చదగినది యని యర్ధమ
4పా; ఆరభమా ఆనత అర కర హా రస మానము అనిుదవి భాగము గావంచినచో ,ఎంగొప్పవారైనా నీముదు వంగి కానుకలు అందించవలసినదే! నీశతృవులందరూ నీముందు హాహాకారములను చేయుచు కరుణరస ప్రయోగముఖులై నిలచి యుండవలసినదే! అను నర్ధము పొసగును.
ఇట్టివింత పద్యములతో వేముని మెప్పించుచు పండిత నికషోపలమై వర్తించు శ్రీనాధుని కాటయవేముడు అందలముల నెక్కించినాడు. అతనితోబాటుగా శ్రీనాధుని మకాము రాజమహేంద్ర వరమునకు మారెను. నేటికింతవరకు చాలును. రాజమహేంద్రి విశేషములను రేపు విందముగాక! సెలవు. శుభంభూయాత్!
No comments:
Post a Comment