రాజమహేంద్రిలో శ్రీనాధుడు
శా: ధాటీ ఘోటక రత్న ఘట్టన మిళద్రా ఘిష్ట కళ్యాణ ఘం
టా టంకార విలుంఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి భృ
త్కోటీ రాంకిత కుంభినీధర సము త్కూ టాటవీ ఝూట క
ర్ణాటాంధ్రాధిప! సాంపరాయని తెలుంగా!నీకు బ్ర హ్మాయువౌ!
భావము; రత్నములవంటి శ్రేష్ఠ మగునీయధ్ధాశ్వముల డెక్కల సవ్వడి తోడై వానిమెడలో మ్రోగు విజయ లక్ష్మీ ప్రదమైన గంటలకు తోడయి మ్రోగు విటినారి మ్రోతల తోడనే తెగిపడుతున్న మదించిన శతృరాజుల శిరస్సుల యందలికిరీటములతో
నలంకరింప బడుచున్న భూమికిప్రభువా!కర్ణాటకరాజకూటమిని చెదర గొట్టినవాడా! సాంపరాయా! నీకు బ్రహ్మాయు వగుగాక! అనిభావము. సాంపరాయని అశ్వముల డెక్కల చప్పుళ్ళకు మెడలోని గంటానాదములకు వింటినారి మ్రోతలను విన్నంతమాత్రముననే శతృవులు నేలకు ఒరుగు చున్నారట! విజయనగరరాజులు, బహమనీలు కూటమిగా నేర్పడి రెడ్డిరాజులపై దండయాత్రలకు దలపడ వివిధోపాయములచే వారికూటమిని భంగమొనరించు యుధ్ధతంత్ర ప్రవీణుడట! సాంపరాయలవారు. వారినిగూడ నుతులచే లోబరచు కొన్నాడు. కస్తూరికాది సుగంధ ద్రవ్యముల నతని వలనపొంది వెలకాంతల కొసంగి తన శృంగార తపనను దీర్చుకొనెడివాడు

అల్లాడ వీరభద్రారెడ్ఢికి ప్రధానామాత్యుడు బెండపూడి అన్నయ మంత్రి. అతడును పాకనాటి నియోగిబ్రాహ్మణుడే! చతురుడైన శ్రీనాధుడు పాతచుట్టరికములను వెదకిజెప్పి యతనిని లోబరచు కొనినాడు .ఈరీతిగా అధికార కేంద్రములనదగిన కాటయవేముని, ప్రభువైన వీరభద్రారెడ్డిని, మహామంత్రి అన్నయామాత్యుని ,రాజకీయముగా వారితో సత్సంబంధములుగల సాంపరాయని యాకట్టుకొని తన ప్రాభవమునకు బహు చక్కని మార్గములను నిర్మించు కొనినాడు.
చుట్టుప్రక్కల నున్న పెద్దాపురము, చాళుక్య భీమవరము, దక్షారామము, తాపేశ్వరము, వంటి భోగపుకాంతలకు ప్రసిధ్ధినొందిన ప్రాంతములలో నిరాటంకముగా తనయైహిక తృష్ణను దీర్చు కొనుచుండెను. కవితావ్యాపారమును గూడానిరాటికముగా నడపించుచుండెను. రాజకీయకార్యములను చక్కగా చక్కదిద్దుచుండెను.
శాసనరచనమొనరించు చుండెను . మహారాణి అనితల్లి " కలువ చేరు" బహుశః అది కలువ చెఱువు గానోపును. అక్కడనామెచే వెలయింప బడిన దాన శాసనమునకు లేఖకుడు శ్రీనాధుడే!
శాసనరచనమొనరించు చుండెను . మహారాణి అనితల్లి " కలువ చేరు" బహుశః అది కలువ చెఱువు గానోపును. అక్కడనామెచే వెలయింప బడిన దాన శాసనమునకు లేఖకుడు శ్రీనాధుడే!
ఇంత తోతనివి నొందక మంత్రి అన్నయామాత్యునకు అంకితముగా భీమేశ్వర పురాణమను నామాంతరముగల భీమఖండము నాంధ్రీకరించుటకు బూనుకొనెను. 6ఆశ్వాసముల పరిమితిగల ఈచంపూ గ్రంధమున దక్షారామ మున వెలసిన భీమేశ్వర స్వామి దివ్య చరిత్రమును పొందుపరచెను. ఇందు వ్యాస ముని సశిష్యముగ కాశిని విడచివచ్చుట, పరమేశ్వరి శాప వృత్తాంతము, అగస్త్య లోపాముద్రలు గూడ దక్షారామమున నివాస ముడుటకు వచ్చిన తీరు, వానికారణములు, చక్కనిశైలితో నావిష్కరింప బడినవి. ఇంతేగాక పరిసర ప్రాంతములందు గల దివ్యతీర్ధరాజముల వర్ణనయు నీగ్రంధమున మనోహరముగా వివరింప బడినవి. శ్రీనాధరచనల లోనిదియొక ప్రౌఢ ప్రబంధమనుట యదార్ధము. నిర్వరామముగా గ్రంధరచనసాగినది. గ్రంధము పూర్తి యైనది.
సకల పండిత సమక్షమున నిండు సభలో రాజసమక్షమున నాడంబరముగా నాగ్రంధమును శ్రీనాధుడు బెండపూడి అన్నయామాత్యునకు అంకితమొసంగి కృత కృత్యుడైనాడు. రాణ్మహేంద్రవరమున నాడు కవికి మహాసన్మానము జరిగినది. శ్రీనాధుని కీర్తి చంద్రికలు ఆకాశనమున కెగ బ్రాకినవి.
శివపూజా ధురంధరుడగు శ్రీనాధుడు రాజమంద్రమునకు సమీపమునగల గోదావరి నదిలోని కొండపై వెలసి యున్న వీరభద్ర స్వామిని దర్శించినాడు. అచటి శైవ మఠమున నివసించు "ఘోడెరాయ" బిరుదాంకితుడైన శైవ గురువుును దర్శించెను. అతడు రాజగురువు. ఆమహనీయుని నామధేయముగూడ వీరభద్ర స్వామియే! శ్రీనాధుడాతనినుండి పాంచరాత్రాగమ సహితముగా వీరశైవమును పొందినాడు. శైవము1పాశుపతము2 కాలాముఖము3 వీరభద్రము అని మూడువిధములు. అందువీరభద్రము సామాన్యులకు అందుబాటులో నుండును.
విభూతి రుద్రాక్ష ధారణము లింగ ధారణము ప్రభాత సంగవ మధ్యాహ్న సాయంత్ర అర్ధరాత్రి పూజలనుపేర 5వేళలలో
నీశ్వరపూజలు-ఇదీ శైవ పాంచ రాత్రాగమ పూజావిధానము. రాజు,మంత్రి, ప్రజలు, అందరూ శైవులే !నాటి రెడ్జి రాజుల పాలనలో సర్వం శివమయం జగత్!

చారిత్రి కాంశములు విస్తారముగా విని యలసట నొందినారేమో ?నేటికింత తోనాపుదము. రేపు తరువాతి యంశమును ముచ్చటించు కొందము గాక! సెలవు.
No comments:
Post a Comment