Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 1

శ్రీనాధుడు----- పోతన

శ్రీనాధుడు--పోతన వ్యక్తిత్వ పరిచయం  


ఆంధ్ర సాహిత్యంలో వీరిరువురు ప్రముఖ కవులేగాని,
భిన్నధధధృవాలు.ఒకరుభౌతికవాది, మరియొకరు ఆదిభౌతికవాది, ఒకరుఆత్మవాది -మరియొకరు అధ్యాత్మవాది .
ఒకరు భోగి మరియొకరు యోగి ..ఒకరు నిత్యసంచారి మరియొకరు నిత్య కృషీవలుడు..ఒకరురాజాశ్రితుడు...
మరియొకరు రామాశ్రితుడు..ఒకరువివిధశాస్త్ర వేత్త_మరియొకరు సహజపండితుడు..ఒకరిది సంస్కృత సమాస
భూయిష్ట రచన మరియొకరిది తత్సమపదమిళితమైన సరళ రచన_.ఒకరుఅర్ధాలంకారప్రియుడు_.మరియొకరు
శబ్దాలంకార ప్రియుడు.. ఇలాఎన్ని విభేదాలు వీరిలో ఉన్నా వీీరిరువురూ సరస్వతీ కృపాకటాక్షమునకు నోచుకున్న
వారే! వీరియిరువురి కావ్యాలూ ఆంధ్రసాహిత్య కేదారంలో పసిడి పంటలు పండించాయి . ఇంకనేేనెంచుకున్న
శ్రీనాధ రవీంద్రుని కీర్తికి పతాకగా పండితులెంచు చున్న ఈ పద్యంతో మనసాహిత్య ప్రస్ధానాన్ని ప్రారంభిద్దాం!

సీ: దీనార టంకాల తీర్థమాడించితి
దక్షిణాధీశు ముత్యాల శాల!
పలుకు తోడైతాంధ్ర భాషా మహాగ్రంధ
నైషధ గ్రంధ నిర్వహణమునను;
పగుల గొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
గౌడ డింఢిమ భట్టు కంచు ఢక్క;
చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద
పాదుకొల్పితి సార్వ భౌమ పదవి;
గీ: ఎటుల నెగ్గించెదో నన్ను నింకమీద
రావుసింగ మహీపాలు ధీవిశాలు
నిండు కొలువున నెలకొని యుండి నీవు
సరస సద్గుణ నికురంబ! శారదాంబ!

1 comment:

  1. అద్బుతం.. శ్రీనాధ .పోతన ల పరిచయం..
    ఒకరుభౌతికవాది, మరియొకరు ఆదిభౌతికవాది,
    ఒకరుఆత్మవాది -మరియొకరు అధ్యాత్మవాది .
    ఒకరు భోగి మరియొకరు యోగి .
    .ఒకరు నిత్యసంచారి మరియొకరు నిత్య కృషీవలుడు.
    .ఒకరురాజాశ్రితుడు...మరియొకరు రామాశ్రితుడు.
    .ఒకరువివిధశాస్త్ర వేత్త_మరియొకరు సహజపండితుడు..
    ఒకరిది సంస్కృత సమాసభూయిష్ట రచన మరియొకరిది తత్సమపదమిళితమైన సరళ రచన_.
    ఒకరుఅర్ధాలంకారప్రియుడు_.మరియొకరుశబ్దాలంకార ప్రియుడు..
    ఇలాఎన్ని విభేదాలు వీరిలో ఉన్నా
    వీీరిరువురూ సరస్వతీ కృపాకటాక్షమునకు నోచుకున్నవారే!
    వీరియిరువురి కావ్యాలూ ఆంధ్రసాహిత్య కేదారంలో పసిడి పంటలు పండించాయి .
    చక్కటి పరిచయం. బాగుంది. అభివందనములు.

    ఒకరు భోగి మరియొకరు యోగి ..ఒకరు నిత్యసంచారి మరియొకరు నిత్య కృషీవలుడు..ఒకరురాజాశ్రితుడు...
    మరియొకరు రామాశ్రితుడు..ఒకరువివిధశాస్త్ర వేత్త_మరియొకరు సహజపండితుడు..ఒకరిది సంస్కృత స

    ReplyDelete